తెలంగాణఅక్షరం-హన్మకొండ
ప్రతీ పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యార్థుల ప్రభంజనం తప్పనిసరిగా ఉంటుందని ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ ఫలితాలల్లో ఉత్తమ మార్కులు సాధించినందుకు విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్, నేడు సీబీఎస్ఈ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మా ఏకశిలా విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయని తెలిపారు. అత్యుత్తమ స్థాయి విద్యాబోధన, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, అంకితభావం గల ఉపాధ్యాయులు, విద్యా విధానానికి అనుకూలంగా వనరులను సమకూర్చడం మా ఏకశిలా విద్యాసంస్థల విజయ రహస్యాలని తెలిపారు.
క్రమశిక్షణతో కూడిన విద్యకు, జీవితంలో ఎదుగుదలకు అవసరమయ్యే నైపుణ్యాలను జోడించి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలన్నదే మా ఏకశిల విద్యాసంస్థల సంకల్పం అన్నారు. మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థినీ విద్యార్థులను అభినందించి జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని కృషి, పట్టుదలతో తమ తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలని తెలిపారు.
కాగా సీబీఎస్ఈ ఫలితాలల్లో ఏం సాయి హాసిని 487 మార్కులు (H.T No 28139504), పీ సాయి పౌర్ణిక్ 483 మార్కులు (H.T No 28139557)లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యా సంస్థల డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి , గౌరు సువిజా తిరుపతిరెడ్డి, ముచ్చ జితేందర్ రెడ్డి, గౌరు రిశ్విక్ రెడ్డి , దినేష్ రెడ్డి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.