దేవతామర్తులకు అభిషేకాలు చేసిన గొల్ల, కురుమలు
తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో గొల్ల, కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బీరన్న పూజారుల వేషధారణ డప్పుచప్పులు నృత్యాలతో గొల్ల కురుమ కులస్తులు, మహిళలు భారీ ర్యాలీగా బీరన్న దేవాలయానికి బుధవారం చేరుకున్నారు. బీరన్న దేవాలయంలో పూజల అనంతరం గ్రామంలోని పోచమ్మ, మాoకాలమ్మ, వెంకటేశ్వర శివాలయం, భూలక్ష్మి-మా లక్ష్మి, పెద్దమ్మతల్లి, మడెలయ్య, ఎల్లమ్మ దేవాలయాల్లో దేవతామూర్తులకు పాలాభిషేకం, జలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ నీల మొండయ్య, వైస్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, మాజీ సర్పంచులు చిన్నాల ఐలయ్య యాదవ్, నీల కుమారస్వామి, కుల పెద్దలు నీల కుమార్, మర్రి రవీందర్, దాడ సమ్మయ్య, గెల్లు సమ్మయ్య, ముష్క ఐలయ్య, తొట్ల మల్లయ్య, దాడ శ్రీనివాస్, నీల ఓదెలు, రాజయ్య, ఎల్లయ్య, కొమురయ్య, సదయ్య, రాయమల్లు, కొమురయ్య, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.