తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
భారతదేశ పౌరుషం, అధునాతన సైనిక బలంతో, ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా నిర్వహించిన త్రివిధ దళాలకు సంఘీభావం తెలిపేందుకు నేడు బీజేపీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు తిరంగ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటానికై బీజేపీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో కొంపల్లి నుండి భారీగా బీజేపీ నాయకులు మరియు జాతీయ వాదులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజి రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోని 11 ఉగ్రముఖల స్థావరాలను పడగొట్టడం అనేది మన దేశ సైనిక శక్తికి తార్కాణం అన్నారు.
ఈ సందర్భంగా సతీష్ సాగర్ మాట్లాడుతూ దేశ సైనిక ప్రగతిని, త్రివిధ దళాల పరక్రమాలకు పాకిస్తాన్ తోక ముడిచించి. పహెల్గాంలో భారత మహిళా యాత్రికుల నొదుట సింధూరం తుడిచిన ఉగ్రమూకలకు, ఆపరేషన్ సింధూర్ పేరిట దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో త్రివిధ దళాలు ఊచకోత కోశాయి. ఈ తిరంగ యాత్రలో కుల, మత, జాతి మరియు రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం మనకు గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ నాయకులు సరిత రావు, అసెంబ్లీ కోకన్వీనర్ శివాజీ రాజు, జిల్లా నాయకులు జీవన్ రెడ్డి, దుర్గా అశోక్, శంకర్ నాయక్, కొంపల్లి పట్టణ నాయకులు మధు, శ్రీనివాస్, మాధురి, నర్సింగ్ రావ్, మహేందర్, ప్రకాష్ రావు, శివాజీ, మహేష్, శేఖర్, మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, అజయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్ కేంద్రంలో ఘనంగా తిరంగ ర్యాలీ
Please follow and like us: