- బీజేపీ బడంగ్పేట్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి
తెలంగాణఅక్షరం-బాలాపూర్
హిందువుల ఇండ్ల మధ్యలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్న చర్చి నిర్మాణాలను తొలగించాలని బడంగ్పేట్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణాలు చేపట్టారని, ఒకచోట రోడ్డును కబ్జా చేసి చర్చిని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.
చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్న కాలనీల్లో అక్రమంగా భవనాలు నిర్మిస్తూ అందులో చేర్చి పేరుతో మత ప్రచారాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారని, కొన్ని సందర్భాలలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పండుగలు, సెలవు దినాలలో సంతోషంగా ఉందామనుకుంటే సౌండ్ పొల్యూషన్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఏమైనా ఆర్థిక ఇబ్బందిగా ఉండి అక్కడ ఉన్న స్థలం గాని, ఇల్లు గాని అమ్ముకుందామంటే కొనడానికి కూడా ఎవరూ రావడం లేదని ఆయన వాపోయారు. అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప లో ప్రజలకు ఉపయోగపడే రోడ్డును కూడా కబ్జా చేసి చర్చి నిర్మాణం చేశారని, దానిని చూసి కూడా అధికారులు పట్టించుకోవడం లేదని శశివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జనావాసాల్లో అక్రమంగా నిర్మించిన చర్చిలను తొలగించాలని శశివర్ధన్ రెడ్డి తోపాటు ప్రజలు పేర్కొంటున్నారు.