ఘనంగా శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవం

తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం బాలాజీ లేఔట్ లో శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహా ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో అర్చకుల వేద మంత్రాలు, మేళ తాళాల మధ్య దేవాలయంలో విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ భీమేశ్వర స్వామి విగ్రహంతో పాటు నందీశ్వరుడు, గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు. ఉదయం నుంచే భక్తులు విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భీమేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు హాజరయ్యారు. ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆశీర్వచనల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దేవాలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చౌదరిగారి బుచ్చి రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అంజన్న, వెంకటేశ్వర్లు, తీర్మాల్, వేణు, కళ్యాణ్, నాగరాజు, ధర్మ ,పలు పార్టీల రాజకీయ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధి కి సహకరిస్తా : ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

గాజులరామారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే పలు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, కాలనీ వాసులు అందరూ కలిసి దేవాలయం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయ అభివృద్ధికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తానన్నారు.

దేవాలయలలో రాజకీయ, కుల, మత బేధాలు లేవు: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

గాజులరామారం బాలాజీ లేఔట్ లో కాలనీవాసుల మానసిక ప్రశాంత కోసం,నూతన దేవాలయం నిర్మాణం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, దేవాలయలలో రాజకీయ, కుల, మత బేధాలు లేకుండా మానసిక మనుగడకు మందిరాలే ముఖ్య మార్గం అన్నారు.నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తానన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *