తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం రోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు వెంకటేశ్వర కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మొక్కలు నాటరు. కొంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ రక్షణ దిశగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజి రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు సరిత రావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ కోకన్వినర్ శివాజీరాజు, కొంపల్లి పట్టణ బీజేపీ నాయకులు మధు, మాధురి, ప్రకాష్ రావు, లక్ష్మి నర్సమ్మ, శివాజీ, శేఖర్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ రక్షణ దిశగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి – ఈటల రాజేందర్
Please follow and like us: