35 మంది కార్యవర్గ సభ్యులతో పూర్తి కమిటీని ప్రకటించిన కొంపల్లి అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్
సమావేశ ముఖ్య అతిథులుగా జిల్లా హాజరైన ప్రధానకార్యదర్శి గిరివర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
సంఘటన సంరచన కార్యక్రమంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అద్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ అధ్యక్షతన మున్సిపాలిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధానకార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు సరిత రావు, ఎన్నికల ప్రభారి ప్రీతం రెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, అసెంబ్లీ కోకన్వినర్ శివాజీ రాజు హాజరై నూతనంగా నియమితులైన పదాధికారులకు , కార్యవర్గ సభ్యులకు దిశ నిర్దేశం చేశారు. 11 సంవత్సరాల మోదీ సంకల్పంతో సాకారం కార్యశాల అనంతరం, నూతన కమిటీ సభ్యులను సన్మానించి నియామక పత్రాలను అందచేశారు.
కొంపల్లి పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులుగా బూరుగుబావి దుర్గా, సూర్య ప్రకాష్ రావు, మహేశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, ప్రధానకార్యదర్శులుగా పల్లికొండ మధు, బూర్గుబావి నర్సింగ్ రావు, కార్యదర్శులుగా, మురళీ కృష్ణ, భారతి, లతమహేశ్వరి, ముత్యాల శ్రీకాంత్, దుర్గం కుమార్ గౌడ్, కోశాధికారిగా ఉప్పరి మహేందర్ సాగర్, కార్యవర్గ సభ్యులుగా బూర్గుబావి మహేష్, కె. మహిపాల్ రెడ్డి, కె. భాస్కర్ రాజు, సి.హెచ్. చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్. మధుసూదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గోరెంకాల భాస్కర్, గోరెంకాల శ్రీశైలం, చంద్రశేఖర్, సి.హెచ్. సందీప్ కుమార్, శివాజీ కిరుబోలె, జయనూరి ప్రకాష్, సంజీవ రెడ్డి, శైలజ, గోపాల్ రెడ్డి, రామి రెడ్డి, జగదీష్, రాఘవేందర్, నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, గంగాయోళ్ళ శివులు, హర్షవర్ధన్ వర్మ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు అశోక్, కొంపల్లి పట్టణ నాయకులు జీవన్ రెడ్డి, నరసింహ, మాధురి, తిరుపతి మరియు నూతన కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం నియామకం
Please follow and like us: