రోహింగ్యాల వాహనంలో పెట్రోల్, కట్టర్, సత్తే, ఐరన్ రాడ్ ల లభ్యం….
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
తెలంగాణ అక్షరం – బాలాపూర్ :
భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఇంటిముందు ఆరుగురు రోహింగ్యలు అనుమానాస్పదంగా శుక్రవారం రెక్కి నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యలు బాలాపూర్ మండల పరిధిలోని డైమండ్ హోటల్ పరిసర ప్రాంతాల్లో, కొత్తపేట శివారులో, చంద్రయన్ గుట్ట సమీపంలో అక్రమంగా నివాసం ఉంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో చలామణి అవుతున్న విషయము విధితమే. ఈ నేపథ్యంలో మే 6వ తేదీన బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాముల యాదవ్ రోహింగ్యాల స్థావరాలను పరిశీలించడం జరిగింది. అక్రమంగా నివాసం ఉండడమే కాకుండా రోహింగ్యలు ధ్రువీకరణ పత్రాలు, వాహనాలు ఎలా కలిగి ఉన్నారు అన్న విషయాలపై ఆరా తీయడం తెలిసింది. అయితే చొరపాటు దారుల వల్ల స్థానికులకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని శ్రీరాముల యాదవ్ స్థానిక పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలోనే రోహింగ్యలు శ్రీరాముడు యాదవ్ ఇంటి వద్ద శుక్రవారం అనుమానాస్పదంగా టచ్చాడుతూ రేక్కి నిర్వహిస్తుండడాన్ని బిజెపి నాయకులు గమనించారు. వారిని పట్టుకుని ప్రయత్నంలో రోహింగ్యలు వారి వెంట తెచ్చుకున్న వాహనం వదిలి పరుగులు తీశారు. బిజెపి నాయకులు వాహనాన్ని తనికీ చేయగా వాహనంలో పెట్రోల్ బాటిల్, సుత్తే, కట్టర్, ఇనుప రాడ్లు ఉండటానికి గమనించారు. దీంతో నాయకులు వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రోహింగ్యాలతో ప్రమాదం పొంచి ఉంది :
మంత్రి మహేష్, బిజెపి సీనియర్ నాయకులు
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కు రోహింగ్యలతో ప్రమాదం ఉందని, పోలీస్ అధికారులు ఈ విషయమై చర్యలు చేపట్టాలని బిజెపి సీనియర్ నాయకులు మంత్రి మహేష్ పేర్కొన్నారు. మారునాయుధాలతో శ్రీరాములు యాదవ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన రోహింగ్యలను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రమాదం జరగకముందే శ్రీరాముల యాదవ్ కు తగిన భద్రత ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు కోరారు.

‘అందెల’ ఇంటిముందు రోహింగ్యాల రెక్కి!
Please follow and like us: