తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐడిపిఎల్ చౌరస్తా లో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్డికాపూల్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ అధ్యక్షులు పార్శి ప్రకాష్ గుప్త, మండల అధ్యక్షులు వాస శ్రీనివాసులు గుప్త, తెరాల శ్రీనివాస్ గుప్త, పవన్ గుప్త, విజయ గుప్త, ఆకుల ప్రభాకర్ గుప్త, భిక్షపతి గుప్త, జగద్గిరిగుట్ట,చింతల్ ,గాజులరామారం,షాపూర్ నగర్,సుభాష్ నగర్ ,సూరారం,సుచిత్ర సంఘాల కార్యవర్గ సభ్యులతోపాటు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మాజీ సీఎం రోశయ్య 92వ జయంతి వేడుకలు
Please follow and like us: