తెలంగాణ అక్షరం-బాలాపూర్ :
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు విరివిగా నాటాలని భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పిలుపునిచ్చారు. అమ్మ చెట్టు కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల పరిధిలోని అల్మాస్గూడ లో చెట్లు నాట కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఇంటి ముందు విధిగా మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతోపాటు పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవచ్చు అన్నారు. విద్యార్థి దశలోనే మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపిస్తే రాబోయే రోజుల్లో మొక్కల ఆవశ్యకత పై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి మొక్కలు పెంచుకుంటే ముందు తరాలకు ఉపయోగకరంగా మారుతాయని చెప్పారు. ఇంకా నీరు కూడా వృధా చేయకుండా మొక్కలకు సరఫరా అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. నిత్యజీవిత మనుగడలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుంటే పర్యావరణం కాపాడిన వాళ్లమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గడ్డంపల్లి శశివర్ధన్ రెడ్డి, కొలను శంకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి, దడిగే శంకర్, వీర కర్ణ రెడ్డి, పర్వత్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటాలి… అందెల
Please follow and like us: