తెలంగాణ అక్షరం- కుత్బుల్లాపూర్ :
కార్గిల్ విజయ్ దినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన దాయాది దేశాన్ని చిత్తుగా ఓడించి, శత్రువులను తరిమి కొట్టి 26 సంవత్సరాలు గడిచిందని అన్నారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో విరోచితంగా పోరాడిన అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం షాపూర్ నగర్ చౌరస్తాలో 5కే రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కేశవ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి దివాకర్ నందన్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు గిరివర్ధన్ రెడ్డి , విగ్నేశ్వర్, అసెంబ్లీ కోకన్వీనర్ శివాజీ రాజు, కొంపల్లి పట్టణ అధ్యక్షులు సతీష్ సాగర్, కోశాధికారి మహేందర్ సాగర్ ,బిజెపి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కార్గిల్ విజయ్ దినోత్సవం…బిజెపి ఆధ్వర్యంలో 5కే రన్
Please follow and like us: