తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:
సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్ లో స్టీల్ వంతెను నిర్మించాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆకుల సతీష్ సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ రోడ్ నుంచి నేషనల్ హైవే కి అనుసంధానం చేస్తూ 3.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రధాన రహదారిలో పరిశ్రమలు ఉండడంతో భారీ వాహనాలను రవాణా కోసం ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వంతెనపై వాహనాల రాకపోవకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ జామ్ సమస్యతో పాఠశాలకు వెళ్తున్న చిన్నారులు, ఉద్యోగస్తులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నట్లు తెలిపారు.ఈ సమస్యపై పలుమార్లు జిహెచ్ఎంసి కమిషనర్, ఎస్ ఆర్ డి పి అధికారులు, సంబంధిత విభాగాలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైప్ లైన్ రోడ్ లో సమస్యను పరిష్కరించేందుకు నాలుగు వరుసలా స్టీల్ వంతెన నిర్మాణానికి రూ. 56 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వంతెన నిర్మాణ పనులు చేపట్టకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన న కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ మాజీ అధ్యక్షులు కంది శ్రీరాములు, జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు పున్నా రెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జై శంకర్ గౌడ్, చందు, వసుంధర, మురళి గౌడ్, రమేష్ యాదవ్, శివకుమార్, కీర్తి శ్రీనివాస్, బిజెపి నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

పైప్ లైన్ రోడ్ లోని నాలాపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలి
Please follow and like us: