తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం దివంగిత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్ర ఫోటోకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూవి ద్య, వైద్య రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు. భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు కూన రాఘవేంద్ర గౌడ్, చింటూ, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గోన్నారు.

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
Please follow and like us: