Blog

అంబేద్కర్ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్సూరారంలో గొల్ల జాన్, పృథ్వి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాజీ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అయన రూపొందించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని కులాలు,మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లా, చిలుక శ్రీనివాస్ , 129 డివిజన్ …

Read More »

కొంపల్లిలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఈటల

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కొంపల్లి లోని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అయన రూపొందించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని కులాలు,మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని …

Read More »

రైతుల సంక్షేమానికి కృషి

సింగల్ విండో అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక రైతుల సంక్షేమానికి సహకార సంఘం కృషి చేస్తోందని, యాసంగి పంట తరుగు, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పీఏసీఎస్‌ చైర్మన్‌ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని గంగారం, ఎల్బాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని అన్నారు. రైతుల సన్నాలకు మద్దతు ధరతో పాటు బోనస్‌ రూ.500 చెల్లిస్తున్నట్లు చెప్పారు. కావున …

Read More »

చల్లూరులో అ‘పూర్వ’ సమ్మేళనం

తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల చల్లూర్ జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో చదివిన 1995-96 బ్యాచ్‌ ఎస్ఎస్సి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ, ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలవేసి, శాలువా కప్పి విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి జ్ఞాపకాలను, గురువులు నేర్పిన క్రమశిక్షణను గుర్తుతెచ్చుకొని, స్నేహితులతో పంచుకున్నారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచడంతోనే, మనం ఈరోజు ఇంతటి విజ్ఞాన వంతులమయ్యామని, ఆనాటి గురువులకు పాదాభివందనాలు అంటూ గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు …

Read More »

దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ

భవిష్యత్‌ అంతా భారతీయ జనతా పార్టీదే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక ఏకాత్మత మానవత వాదం, అంత్యోదయ స్ఫూర్తితో బిజెపి 45 ఏళ్ల ప్రస్తానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని దేశంలో ఏ పార్టీకి లేని విధానం, సిద్ధాంతం బిజెపికే ఉన్నాయని, ఆ పార్టీ అనుసరించిన విధానాలు మార్గాలతోనే ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన నెంబర్ 1 పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి ఆవిర్భావ …

Read More »

అక్రమాలపై స్పందించడం లేదంటూ… ఉప్పలమ్మ తల్లికి బీజేపీ ఆధ్వర్యంలో వినతి

  తెలంగాణ అక్షరం – బాలాపూర్ బడంగ్పేట్ మున్సిపల్ అక్రమాలపై అధికారులు స్పందించడం లేదంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఉప్పలమ్మ తల్లికి వినతిపత్రం సమర్పించి వినూత్న నిరసన తెలిపారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలుపుతూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ, బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, రోడ్లు, నాలాలు, పార్కుల స్థలాలు అక్రమంగా ఆక్రమించబడి ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల వీటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. …

Read More »

శ్రీరాముని చిత్రాన్ని చించిన…. మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలి : బీజేపీ

తెలంగాణ అక్షరం – బాలాపూర్ శ్రీరాముని చిత్రపటాన్ని చించి హిందూ మనోభావాలను అవమానించే విధంగా ప్రవర్తించిన బడంగ్‌పేట్ మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాత గ్రామపంచాయతీ సర్కిల్ వద్ద శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరాముని పటాన్ని మున్సిపల్ సిబ్బంది చించి వేశారని బీజేపీ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీరాముని …

Read More »

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం తెలంగాణ అక్షరం – బాలాపూర్ ఏప్రిల్ 12 ,13 తేదీలలో మహారాష్ట్ర నాగపూర్ లో జరిగే అఖిల భారతీయ మేదరి మహేంద్ర సంఘం ప్రతినిధుల సమావేశానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం బృందం శుక్రవారం బయలుదేరి వెళ్ళింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నటువంటి మన మేదరులను ఎస్టీలో కలపాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం అఖిల భారతీయ సమావేశంలో మద్దతు కూడా కట్టే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ తెలిపారు. బయలుదేరిన …

Read More »

ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

జ్యోతిబా ఫూలే గారి జీవిత సూత్రాలను ఆదర్శంగా తీసుకుందాం – కొంపల్లి బీజేపీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్ ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే జన్మదినం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కన్వీనర్ డా. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి, విఘ్నేష్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి , అసెంబ్లీ …

Read More »

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

వీణ వంక  : శ్రీ రాములపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుర్మిండ్ల రాజయ్య (78) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం. మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల రాజయ్య 1990-95లో సర్పంచ్ గా గ్రామ ప్రజలకు సేవలందించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాజయ్య గురువారం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. రాజయ్య మృతిపట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More »