కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని, చక్కటి పరిపాలనకు నాంది అని స్వామి మరియ స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన గాని, చూసినా గాని, విన్నా గానీ, ప్రచారం చేసినా గాని అన్ని రంగాలలో విజయం సాధ్యమవుతుందని …
Read More »Blog
రైతులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి
రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ తెలంగాణ అక్షరం-వీణవంక రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా త్వరలో హైదరాబాద్, జాతీయ స్థాయిలో రైతు సంఘాల నేతలు, మేధావులతో సదస్సు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా …
Read More »హసన్‌పర్తిలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
తెలంగాణ అక్షరం- హసన్ పర్తి స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. తాము కూడా భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చాడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో చక్కగా చదువుకోని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, దేవమ్మ, పున్నంచందర్, శ్రీకాంత్, రేవతి, …
Read More »వీణవంక శాలివాహన సంఘం మండల కమిటీ ఎన్నిక
తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల శాలివాహన సంఘం నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మండల అధ్యక్షుడిగా మందారపు నరేష్, ఉపాధ్యక్షులుగా కొలిషెట్టి మొండయ్య, నల్లవెల్లి సంపత్, ప్రధాన కార్యదర్శిగా తాటికంటి తిరుపతి, కార్యదర్శులుగా ఇజిగిరి నరేష్, సిలివేరి విజయ్ ను ఆ సంఘం నాయకులు ఎన్నికున్నారు. ఈ సందర్భంగా నూతనంగా కమిటీని మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కులసంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read More »ఎనిమిదో రోజుకు చేరిన మార్క సురేష్ పాదయాత్ర
యాత్రకు సంఘీభావం తెలిపిన పలువురు సగర నాయకులు తెలంగాణఅక్షరం-హన్మకొండ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రాముడి కల్యాణం కోసం పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సగర సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కాగా ఈ యాత్ర 250కి.మీ పూర్తి చేసుకుని ఖమ్మ జిల్లాలోని ఏన్కూరు చేరింది. కాగా ఈ పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి …
Read More »హెచ్ సి యూ భూములను కాపాడాలి
పోలీస్ నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు CPM జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణఅక్షరం-కరీంనగర్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ… సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక వద్ద జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీస్ వేషధారణలో నాయకులకు సంకెళ్లు వేసి లాక్కెళ్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం …
Read More »ఏడో రోజుకు చేరిన భద్రాచలం మహా పాదయాత్ర
తెలంగాణఅక్షరం-ఖమ్మం భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్ సగర చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం నాటికి ఏడో రోజుకు చేరింది. ఈ యాత్ర ఏడో రోజు ఖమ్మం జిల్లాలో ప్రవేశించగా ఆ జిల్లాకు చెందిన సగరులు ఈ సందర్భంగా సురేషన్ ను పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సురేష్ సగర మాట్లాడుతూ తాము భగీరథ మహర్షి, శ్రీరాముని వంశీయులమని, భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి తామే తలంబ్రాలు అందించేలా ప్రభుత్వం …
Read More »మీ సేవల దోపిడీ
జిల్లా వ్యాప్తంగా భారీగా వసూళ్లు.. పట్టించుకోని ఈడీఎం, అధికారులు ఈడీఎంను మార్చాలని ప్రజల డిమాండ్ తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీ సేవ సెంటర్లలో వసూళ్ల పర్వం సాగుతోంది. ఈడీఎం, డీఎంతో పాటు తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు సెంటర్లంటే నిర్వాహకుల ఇష్టారాజ్యం అనుకోవచ్చు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగుతుందటే ఖచ్చితంగా అధికారుల వైఫల్యమే కారణమని అంటున్నారు. మీ సేవ సెంటర్లలో తనిఖీలు చేసిన అధికారులు.. మళ్లీ అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఇలా …
Read More »స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు
ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు. తెలంగాణ అక్షరం – హుజురాబాద్ కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లుపై పాలకులకు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ పబ్బం గడుపుకునే కంటి తుడుపు చర్యలు మాత్రమే నని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామా రావు ఆరోపించారు. మంగళవారం హుజురాబాద్ లో మీడియా ప్రతినిధులతో పోలాడి రామారావు మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ల పై చిత్తశుద్ది …
Read More »పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సన్మానించిన సీసీఎస్ పోలీసులు
తెలంగాణఅక్షరం-కరీంనగర్ కరీంనగర్ కమీషనర్ లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ వీరయ్యను సిసిఎస్ అధికారులు, తోటి ఉద్యోగులు సోమవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంతో సమయం గడపాలని సూచించారు. సిసిఎస్ ఏసిపీ కాశయ్య, ఏఎస్ఐ వీరయ్యకు పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు శేఖర్, నాగరాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »