Blog

మున్సిపాలిటీ కార్మికులకు టోపీల పంపిణీ

కొంపల్లి పట్టణ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి -పెద్దబుద్దుల సతీష్ సాగర్మున్సిపాలిటీ కార్మికులకు టోపీలు ఇవ్వడం అభినందనీయం – కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్రాబోయే ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు ఎండ తీవ్రతకు తట్టుకొనేందుకు వీలుగా సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు టోపీలను అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణరెడ్డి , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలకు రక్షణగా మున్సిపాలిటీ కార్మికులకు …

Read More »

ఆశల అరెస్టు సరికాదు

ఆశల అరెస్టును ఖండించిన జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి. వీణవంక : హైదరాబాద్ లో నిరసన కార్యక్రమానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడాన్ని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వీణవంకలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.రాష్ట్రంలో ప్రజలతోపాటు ఉద్యోగులు నిరసన తెలిపే …

Read More »

యూత్‌ పార్లమెంట్‌ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు

హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో ఇటీవల విశ్వవిద్యాలయం క్యాంపస్లో నిర్వహించిన జిల్లాస్థాయి యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు రెండో బహుమతి సాధించినట్లు ప్రిన్సిపల్‌ సుంకరి జ్యోతి తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ఎన్‌ఎస్ఎస్ విభాగం అధ్యాపకులు శ్రీదేవి, కనకయ్య, చందులాల్‌, శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.

Read More »

పదవ తరగతి విద్యార్థులు పట్టుదలతో పరీక్షలు రాయాలి

  తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్ టౌన్ పదో తరగతి విద్యార్థులు పట్టుదలతో చదువుకుని ఒత్తిడికి గురి కాకుండా పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మాజీ ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ తెలిపారు. పట్టుదలతో చదివిన అంశాలను ఒత్తిడికి గురికాకుండా కాగితంపై విశధికరిస్తే ఉత్తమ ఫలితం సాధిస్తారని పేర్కొన్నారు. పరీక్షలు అనగానే లోలోపల భయపడకుండా ప్రశాంతమైన మనసుతో రాయడమే విజయానికి నాంది అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, గురువులు ఆశయాల అనుగుణంగా రాణించేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. చదువు ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చని, …

Read More »

కేటీఆర్ సభలో అపశృతి

కరీంనగర్‌లో మహిళ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన రేస్ బైక్ దవఖానలో చికిత్స పొందుతున్న పద్మజ తెలంగాణ అక్షరం- కరీంనగర్ సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నేతల ర్యాలీలో కరీంనగర్‌ కోతి రాంపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు బుల్లెట్ వాహనంతో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ బైకును రేస్ చేస్తూ జనం పైకి దూసుకెళ్లాడు.ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజ అనే మహిళా కానిస్టేబుల్ ను ఢీ కొనగా కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటంతో పాటు ఆమె కాలు విరిగింది.దీంతో అక్కడే ఉన్న పోలీసు …

Read More »

హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

హుజురాబాద్- తెలంగాణ అక్షరం హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీకి అధ్యక్షుల, కార్యదర్శి పదవికి ఎన్నికలు ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, వాసవి కళ్యాణ మండపంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సంఘంలో మొత్తం 245 మంది సభ్యులకు గాను, 175 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి చెన్నూరు సురేష్ కుమార్ మరియు ఎలాబాక కృష్ణకుమార్ పోటీ పడగా చెన్నూరు సురేష్ కుమార్ కి 103, ఎలబాక కృష్ణకుమార్ కి 67, చెల్లుబడి కాకుండా …

Read More »

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి తెలంగాణ అక్షరం-కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆపదలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం అన్నదాతల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. చేతికి వచ్చే స్థితిలో మొక్కజొన్న మామిడి, వరి పంటలు నేలకొరిగాయన్నారు. జిల్లాలో చొప్పదండి, రామడుగు,గంగాధర, …

Read More »

హసన్ పర్తి పాఠశాల తనిఖీ

తెలంగాణ అక్షరం – హసన్ పర్తి స్థానిక మసీదు ఆవరణలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి రాజిరెడ్డి సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజనాన్ని, గ్రంథాలయ పుస్తకాలను వినియోగమును,పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ అలైన్మెంట్ పాటించాలని, విద్యార్థులచే ప్రతిరోజు వర్క్ బుక్కులు రాయించాలని, గ్రంథాలయ పుస్తకాలు చదివించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చాడ సుదర్శన్ రెడ్డి, …

Read More »

‘రాజీవ్ యువ వికాసం’ ను సద్వినియోగం చేసుకోవాలి

  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నరాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రూ.4 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …

Read More »

ఇసుక ట్రాక్టర్ బోల్తా- యువకుడి మృతి

తెలంగాణ అక్షరం- జమ్మికుంట కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి ప్రశాంత్ (32) ఇసుక లోడుతో ట్రాక్టర్ నడుపుతుండగా మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రశాంత్ మృతి చెందడంతో విలాసాగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »