తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి, బీఆర్ఎస్ నాయకులు ఆనందం రాజమల్లయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, కమలాపూర్ మాజీజెడ్పిటిసి పుల్ల నవీన్ కుమార్, నాయకులు సత్యనారాయణ రావు, ఇంద్రసేనారెడ్డి, భానుచందర్, మధు, మహేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
Read More »Blog
పరీక్ష సామగ్రి అందజేత
తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రానికి చెందిన ట్యురిటో సంస్థల అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లోని కస్తూర్బా గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్ష ప్యాడ్లు, పెన్నులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపెళ్లి కుమారస్వామి, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, మంతెన శ్రీధర్, తొట్ల రాకేష్, మహంకాళి రాజు, కోరె …
Read More »మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత
తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన పోలు రాజయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తి కృష్ణా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా 50 కేజీల బియ్యం పంపించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జున్నుతుల కొమాల్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, ఎండీ సలీం తదితరులు మృతుడి కుటుంబానికి అందజేశారు.
Read More »మూడు రోజులు వైన్ షాపులు బంద్
తెలంగాణ అక్షరం – హైదరాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Read More »16న నాగర్ కర్నూల్ లో సగర శంఖారావం
సగరలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావాలి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నలుబాల సతీష్ సగర తెలంగాణఅక్షరం-హన్మకొండ తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో 16న నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించతలపెట్టిన సగర శంఖారావం విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నలుబాల సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి కుర్మిండ్ల కుమారస్వామి (అయోధ్య) సగర, కోశాధికారి మంగునూరి రఘు సగర, సింగారం ప్రాంత గౌరవ అధ్యక్షుడు చిదురాల రాజు సగర, అధ్యక్షుడు కొడిపాక రాజయ్య సగర, ప్రధాన కార్యదర్శి నీలం లక్ష్మయ్య …
Read More »16న నాగర్ కర్నూల్ లో సగర శంఖారావం
తెలంగాణఅక్షరం-వీణవంక తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో 16న నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించతలపెట్టిన సగర శంఖారావం విజయవంతం చేయాలని తెలంగాణ సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర ్యం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు పాలకులు మనల్ని గుర్తించకపోవడం చాలా శోచనీయమని పేర్కొన్నారు. కావున …
Read More »విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
తెలంగాణ అక్షరం-వీణవంక విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందిన సంఘటన వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని కొండపాక గ్రామానికి చెందిన దాట్ల మల్లయ్య ఇటీవల రూ.70వేలు వెచ్చించి వ్యవసాయం కోసం ఎద్దును కొనుగోలు చేశాడు. కాగా ఎప్పటిలాగానే మేతకోసం పొలం వద్దకు తీసుకెళ్లి వదిలాడు. మేత మేసుకుంటూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అక్కడున్న తీగలకు తగలి ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడకక్కడే మృతి చెందింది. దీంతో రైతు కుటుంబం బోరున …
Read More »సగర సంఘ సేవలు అభినందనీయం
నేత్ర వైద్యుడు గుండేటి గణేష్ రెడ్డిపల్లిలో సగర సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం తెలంగాణఅక్షరం-వీణవంక సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు. సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్, సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర …
Read More »మహాత్మా.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించు
బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ తెలంగాణఅక్షరం-వీణవంక తెలంగాణ రాష్ట్రంలోని అసమర్థ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ కోరారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మండలంలోని కొండపాక గ్రామంలో గాంధీ గారికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ వర్మ మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం అబద్ధాలను ప్రచారం చేసి నెరవేరని …
Read More »జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయూ లక్ష్యం
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి ఘనంగా టీయూడబ్ల్యూజేే 2025 డైరీ ఆవిష్కరణ తెలంగాణ అక్షరం -హన్మకొండ జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తామని, జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) ముందుకు సాగుతున్నదని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి తెలిపారు.గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.అక్రిడేషన్ లపై జరుగుతున్న దుష్ర్పచారం జర్నలిస్టులు నమ్మవద్దని కోరారు. …
Read More »