తెలంగాణఅక్షరం-వీణవంక మధ్యాహ్న భోజనం విషయంలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలని వీణవంక ఎంఈవో సుద్దాల శోభారాణి సూచించారు. మండలంలోని పలు పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులకు శుక్రవారం ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగూణంగా తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ శుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రతినిధులు పులి అశోక్ కుమార్, సంతోష్ కుమార్, నాగిరెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులు, పాల్గొన్నారు.
Read More »Blog
దీక్షా దివాస్ విజయవంతం చేయాలి
వీణవంక మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించతలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రామాన్ని విజయవంతం చేయాలని వీణవంక మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ అక్షరంతో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కరీంనగర్ జిల్లా కీలకంగా వ్యవహరించిందని, మాజీ సీఎం కేసీఆర్ ను అలుగునూరులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని గుర్తు చేశారు. దీనికి గుర్తుగా రాష్ట్రమంతటా దీక్షా …
Read More »గుండ్ల సింగారం సగర సంఘం కమిటీ ఎన్నిక
తెలంగాణ అక్షరం-హన్మకొండ హన్మకొండ జిల్లా పరిధిలోని గుండ్లసింగారం సగర సంఘం కమిటీని ఆ సంఘ సభ్యులు జిల్లా ఎన్నికల అడహక్ కమిటీ కన్వీనర్ సీత కమలాకర్ రావు, కో కన్వీనర్లు వడ్లకొండ కుమార స్వామి, సీత రమేష్ కుమార్, కుర్మిండ్ల సదానందం ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొడిపాక రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా నీలం లక్ష్మయ్య, కోశాధికారిగా కట్ట రాజు ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా దుంపల మహేందర్, గౌరవ సలహాదారుడిగా తాడిశెట్టి శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా చిదురాల రాజు, కొడిపాక సన్నిత్, సుతారి …
Read More »సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం పిక్స్..!
డిసెంబర్ లో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు..! తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. అవే సర్పంచ్ ఎన్నికలు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024, డిసెంబర్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు.2025 జనవరి నెలలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారని మీడియా చిట్ చాట్ లో వెల్లడించారాయన.2024, ఫిబ్రవరి నెలతోనే సర్పంచ్ ల పదవీ కాలం ముగిసింది. ప్రభుత్వం ఇంచార్జీల పాలన నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన …
Read More »సగరుల ఆర్థిక అభివృద్ధికి చేయూతనివ్వండి
సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్కొండ ప్రసాద్ తెలంగాణ అక్షరం-కరీంనగర్ సగర్ల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను సగర సంగం సంఘం జిల్లా అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన బీసీల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలో నిర్మాణ రంగంలో సగరుల పాత్ర కీలకమని సగరులను గుర్తించడంలో ప్రభుత్వాలు …
Read More »జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలంగాణ అక్షరం-జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఒక జర్నలిస్టు యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను మభ్యపెట్టి పక్కదారి పట్టించేందుకు ఆ యూనియన్ చేస్తున్న చర్యలను ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. యూనియన్ చేస్తున్న అనధికారిక కార్యకలాపాలకు మీడియా అకాడమి ఛైర్మన్ మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు. ఆదివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »పేక’ఆట’లో ప్రముఖులు
నర్సంపేటలో కలకలం.. పేకాటాడుతూ పట్టుపడిన రాజకీయ నాయకులు.! సర్వాపురంలోని ఓ ఇంటిలో ఆడుతుండగా పలువురిని పట్టుకున్న పోలీసులు తెలంగాణఅక్షరం – నర్సంపేట నర్సంపేట పట్టణంలోని పలువురు ప్రముఖులు పేకాటాడుతూ ఆదివారం పట్టుబడ్డారు. పట్టణ ప్రముఖులు పేకాట ఆడి పట్టుబడ్డారన్న వార్త నర్సంపేట పట్టణంలో హల్చల్ చేస్తోంది. పట్టణంలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నర్సంపేట పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సంపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఉన్నారు. పట్టుబడిన వారిలో నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ …
Read More »మల్లారెడ్డిపల్లి క్రీడాకారులకు దుస్తుల అందజేత
తెలంగాణ అక్షరం-వీణవంక ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంటు నంది మేడారంలో జరుగుతున్న సందర్భంగా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి వాలీబాల్ క్రీడాకారులకు జగిత్యాల పోలీస్ ఆర్.ఐ రామకృష్ణ, కన్నా రమేష్, కోచ్ మోహన్ రావు ఉమ్మడి వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,పడాల అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు క్రీడా దుస్తులు శుక్రవారం అందజేశారు. క్రీడా దుస్తులు అందజేసినందుకు నాని క్రీడాకారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో క్రీడాకారులు, కర్రే నాని, హరీష్, రాము, ప్రశాంత్, అనిల్, …
Read More »చికిత్స పొందుతూ మహిళ మృతి
రెండో భర్త వేధింపులే కారణం..? మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తెలంగాణఅక్షరం-వీణవంక రెండో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని బేతిగల్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన ఇడుమాల వెంకటలక్ష్మి కూతురు తిరుపకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే వీరి కుటుంబం కొంత కాలం పాటు సజావుగా సాగింది. వీరికి …
Read More »దుర్గామాత శిబిరాలను సందర్శించిన కొమ్మిడి
తెలంగాణ అక్షరం వీణవంక వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి, చల్లూరు తదితర గ్రామాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన మేకల ఎల్లారెడ్డి, కొండాల్ రెడ్డి, కిరణ్, మధుసూదన్, గడ్డం కుమార్, కుమారస్వామి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ, సతీష్, అజయ్, నితీష్, సందీప్, లక్ష్మణ్, కొమురయ్య, రాకేష్ రెడ్డి యువ సైన్యం సభ్యులు పాల్గొన్నారు.
Read More »