Blog

బీఆర్ఎస్ కు షాక్..

హనుమకొండ బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి అనుమతి లేదంటూ మునిసిపల్ అధికారుల నోటీసులు తెలంగాణ అక్షరం-హనుమకొండ హనుమకొండ బీఆర్‌ఎస్‌ భవనంకు అనుమతి లేదంటూ గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు బీఆర్‌ఎస్‌ హనుమకొండ అధ్యక్షుడికి నోటీసులను జారీ చేశారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్‌ కార్యాలయంకు నోటీసులు ఇచ్చారు. కాజీపేట సర్కిల్‌ కార్యాలయం నుంచి ఈ/285476/జీడబ్ల్యూఎంసీ/ఏసీపీ-3/వార్డు నెంబరు 30/2024 లేఖను 25 జూన్‌ న అందించారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లో తీసుకున్న అనుమతి పత్రాలను సమర్పించాలని నోటీసుల్లో కొరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ …

Read More »

కొలవుల భర్తీకి రంగం సిద్ధం

ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌ తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్‌ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా TGS RTCలో కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 3వేల35 పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.ఈ 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెం డెంట్‌ మెకానిక్‌, 84 డిప్యూటీ సూపరింటెం డెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌,అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ …

Read More »

వీణవంకలో ఘనంగా ఎల్లమ్మ బోనాలు

తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.వీణవంక మండల కేంద్రంలో దళిత కులస్తులు, పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ప్రతి వీధి నుండి బోనాలు ఎత్తుకొని, కోలాట నృత్యాలతో బస్టాండ్ కూడలి నుండి ఎల్లమ్మ తల్లి గుడి వరకు ర్యాలీగా వెళ్లారు. రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించి గ్రామము సుభిక్షంగా పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకున్నారు .ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, పులాల మొండయ్య, దాసరాపు రాజయ్య, దాసరపు …

Read More »

బాధితులకు స్వాంతన అందించాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలంగాణ అక్షరం వరంగల్ క్రైమ్   లైంగిక దాడులకు గురైన బాధితులకు స్వాంతన అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రం పై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భరోసా కేంద్రం నాల్గవ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా పోలీస్ కమిషనర్ రంగంపేట్ లోని భరోసా కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వారోత్సవ వేడుకలకు హాజరయి భరోసా కేంద్రం అధికారులు, సిబ్బందితో కల్సి కేక్ కట్ చేశారు. అనంతరం భరోసా కేంద్రం తీరును తెలుసుకోవడంతో …

Read More »

ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

ఉరేసుకొని చొప్పదండి శాసనసభ్యుడు సతీమణి మృతి తెలంగాణ అక్షరం- హైదరాబాద్ చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 12 ఏళ్ళ క్రితం రూపదేవిని మేడిపల్లి సత్యం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంపల్లిలోని సంవత్సర …

Read More »

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

    రివార్డ్ అందజేసిన ఇంచార్జ్ కమిషనర్ అభిషేక్ మహంతి   తెలంగాణ అక్షరం-వరంగల్ కమిషనరేట్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్పర్తి మండలానికి చెందిన ఇద్దరు మావోయిస్టు దంపతులు శనివారం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత 27 తన ఇంటర్మీడియేట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 …

Read More »

పిడుగుపాటుకు గేదె మృతి

  తెలంగాణఅక్షరం-వీణవంక   మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ట ఈశ్వరమ్మకు చెందిన గేదె పిడుగుపాటుకు గురువారం సాయంత్రం మృతి చెందింది. బాధితురాలు కథనం ప్రకారం.. బాధితురాలు ఇటీవల గేదెను సుమారు రూ.50 వేలతో కొనుగోలు చేసింది. కాగా గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులతో పాటు ఇంటి సమీపంలో చెట్టుకు కట్టేసిన గేదేపై పిడుగు పడింది దీంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతితో బాధిత కుటుంబం రోదనలు మిన్నంటాయి.

Read More »

ఆ ఐటీఐలో ఎన్నికల కోడ్ వర్తించదటా..?

ప్రోత్సాహకాల పేరుతో విధులకు డుమ్మా.. సూపరింటెండెంట్ కు సహకరించిన వరంగల్ ఐటీఐ ప్రిన్సిపల్ నిత్యం ఇలాగే జరుగుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్న కూత వేటు దూరంలో ఉన్న ఆర్డీడీ కార్యాలయం తెలంగాణఅక్షరం-వరంగల్ అది ములుగు రోడ్డులోని ప్రభుత్వం వరంగల్ ఐటీఐ కళాశాల. గతంలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, వక్తిత్వ వికాసం, వృత్తి శిక్షణ ఇస్తూ వారికి మెరుగైన భవిష్యత్ కు నిలయంగా ఉండే ఐటీఐ కళాశాల. ఒకప్పుడు ఆ కళాశాలలో సీటు దొరకాలంటనే అదృష్టంగా భావించే పరిస్థతి. కానీ నేడు …

Read More »

ఐటీఐ దరఖాస్తుల స్వీకరణ

జూన్ 10వ తేది చివరి గడువు దరఖాస్తు చేసుకోవాలంటున్న వరంగల్ ఐటీఐ ప్రిన్సిపల్ జుమ్లా నాయక్   తెలంగాణఅక్షరం-వరంగల్ 2024-2025 విద్యా సంవత్సరంనకు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి గాను దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వరంగల్  ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. జూన్ 10 వ తేదీ వరకు ప్రభుత్వం చివరి గడువును నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘తెలంగాణ అక్షరం’తో మాట్లాడారు. వరంగల్ ఐటీఐలో నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు, వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఐటీఐ …

Read More »