తెలంగాణ అక్షరం- కుత్బుల్లాపూర్ :బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆకుల సతీష్ ఆధ్వర్యంలో వివిధ కాలనీలలో అమ్మవారి గుడులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని, రాష్ట్రానికి సమృద్ధి మరియు శాంతి చేకూరాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్‌తో ,నల్ల జై శంకర్ గౌడ్, పులి బలరాం, చందు, లానా, ముఖేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
Read More »Blog
వాసవి మాత ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :గాజులరామారంలోని వాసవి మాత ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు కూరగాయలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత అయిన వాసవి మాత భక్తులకు శాకాంబరి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలలో ఆర్యవైశ్య సంఘ నాయకులు అన్నదాన అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల సందడితో అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. భక్తులకు …
Read More »పార్కు స్థలాల కబ్జాపై బిజెపి కన్నేర్ర….
ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలే కబ్జాదారులు….?మాయమవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలి….రిలే నిరాహార దీక్షలో ‘అందెల’తెలంగాణ అక్షరం- బాలాపూర్ :బాలాపూర్ మండలం బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పార్కు స్థలాలు కబ్జా అవుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో పాటు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని భారతీయ జనతా పార్టీ కన్నేర్ర చేసింది. బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణ రెడ్డిల ఆధ్వర్యంలో అన్యాక్రాంతం అవుతున్న పార్కు స్థలాలను పరిరక్షించాలని కోరుతూ …
Read More »కొంపల్లి మున్సిపాలిటీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
– బీజేపీ పట్టణ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో ఉన్నటువంటి డ్రైనేజీ,రోడ్డు సమస్యలను పరిష్కరించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొంపల్లి బిజెపి పట్టణ నాయకులు , పట్టణ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అవని గార్డెన్ డ్రైనేజీ, పోచంపల్లి రోడ్డు లోని అపర్ణ పామ్ గ్రూవ్ నుండి రాయల్ పార్క్ వరకు రోడ్డు, దూలపల్లి, జయభేరి , ఎన్.సి.ఎల్ కాలనీలోని పలు సమస్యలను కమిషనర్ …
Read More »సోలార్ సీసీ కెమెరా అందజేత
తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు మద్దుల ప్రశాంత్ పటేల్, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్ సీసీ కెమెరాను అందజేశారు. ఈ సందర్భంగా మద్దుల ప్రశాంత్ పటేల్ మాట్లాడారు. నేర పరిశోధన విభాగంలో ప్రముఖ పాత్ర వహించేవి సీసీ కెమెరాలను, గ్రామ గ్రామాన అనుకోని ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రమాదాలను ఎప్పటికప్పుడు నివారించవ్చని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు, నిఘా నేత్రాలు, ప్రజలకు రక్షణ కవచాలుగా పనిచేస్తూ, ప్రముఖ పాత్ర …
Read More »అపూర్వ కలయిక… భావోద్వేగాల మధ్య పూర్వ విద్యార్థుల సమ్మేళనం
తెలంగాణ అక్షరం – హుజురాబాద్:21 ఏళ్ల క్రితం విడిపోయిన మిత్రులు ఒకసారిగా అంతా ఒకే వేదికపై కలవడంతో వారి భావోద్వేగాలకు అంతులేకుండా పోయింది. హుజురాబాద్ పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో కాకతీయ పాఠశాలలో 2003-04 లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ ఆదివారం వేడుకలు కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూస్తూ ఆనందంతో పాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ సమ్మేళనంలో విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు సైతం కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సుమారుగా 21 సంవత్సరాల తర్వాత …
Read More »భీమేశ్వర స్వామి ఆలయంలో రుద్ర హోమం
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో భీమేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండలం కాలం పూర్తయిన సందర్భంగా ఆదివారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం లక్ష్మీ గణపతి మూల తంత్ర సహిత రుద్ర హోమం చేశారు. పూర్ణ హారతి, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
Read More »ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరిక తెలంగాణఅక్షరం-వీణవంక మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు. మండల పరిధిలోని కొండపాక, చల్లూరు గ్రామాల్లో మానేరు తీరం నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లూరు చెందిన దామెర నర్సయ్య, కొండపాకకు చెందిన సల్పల సమ్మయ్య ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా వారిపై కేసు నమోదు …
Read More »కాకతీయ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.. : బీఆర్‌ఎస్‌వీ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్
తెలంగాణఅక్షరం-వీణవంక జమ్మికుంట పట్టణంలోని కాకతీయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌వీ సీనియర్ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. వీణవంక మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో సీబీఎస్సీ కాకతీయ విద్యాసంస్థల బస్సు నడిరోడ్డుపై మూడు రోజుల నుండి ఉంటున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫిట్‌నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులు …
Read More »పూర్వ విద్యార్థుల ఔదార్యం… ఏవివి పాఠశాల అభివృద్ధికి విరాళం
తెలంగాణ అక్షరం- వరంగల్:వరంగల్ లోని ఏవివి పాఠశాలలో 2002-03కు చెందిన విద్యార్థులు ఇటీవల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కొరకు తమ వంతు సాయం అందజేస్తామని పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం రోజు ప్రధానాచార్యులు , ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల అభివృద్ధి కొరకు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ విద్యార్థుల సద్భావన పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, పూర్వ విద్యార్థుల ఔదార్యం ప్రస్తుతం …
Read More »