Blog

వీణవంకలో దళితబంధు సాధన సమితి నాయకుల అరెస్టు

వీణవంక, మే 24:మండల కేంద్రంలో దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు.అక్రమ అరెస్టు సరైన పద్ధతి కాదని, వెంటనే దళిత బంధు రెండో విడుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో దళిత బంధు …

Read More »

గొల్ల, కురుమ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో కురుమ, గొల్ల కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు గొల్ల, కురుమ కులస్తులు అమ్మవారిని సమర్పించారు. ఒగ్గు పూజారిలొచ్చే ఒగ్గు డోల తో నృత్యాలతో  గొల్ల, కురుమ కులస్తులు మహిళలు పోచమ్మ దేవాలయం చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కురుమ కులస్తులు పాల్గొన్నారు.

Read More »

బోర్నపల్లి గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం కార్యవర్గం ఎన్నిక

తెలంగాణఅక్షరం-హుజురాబాద్‌ హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేశ బోయిన ఓదెలు ప్రధాన కార్యదర్శిగా కేశ బోయిన అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కేశవైన లింగయ్య ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా నాని, రమేష్, మేడుదుల రాజు, కేశ బోయిన కేతమ్మ, గుంపుల రాజమ్మ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సాయంత్రం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను సంఘ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

Read More »

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. పెద్దపల్లి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

తెలంగాణఅక్షరం-పెద్దపల్లి జిల్లాలో విత్తనాల డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు వికయిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో విత్తనాల విక్రయంలో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్‌ ఫర్టిలైజర్స్​‍ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌, రాష్ర్ట విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సుంకేటి అవినాష్‌ రెడ్డితో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం …

Read More »

Strict action | నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. శిక్షణ ఎస్సై సాయికృష్ణ

తెలంగాణఅక్షరం-వీణవంక Strict action |  ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శిక్షణ ఎస్సై సాయికృష్ణ విత్తన డీలర్లను హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫర్టిలైజర్స్‌, ఫెస్టిసైడ్స్‌ షాపుల యజమానులతో ఏఓ గణేష్ తో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మకూడదని, గుర్తుతెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమినాశకాలు అమ్మకూడదని సూచించారు. పురుగు మందులు అమ్మేటపుడు రైతు ఆధార్ కార్డు, పాస్ బుక్ జీరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. …

Read More »

బీరన్న పెద్ద పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

దేవతామర్తులకు అభిషేకాలు చేసిన గొల్ల, కురుమలు తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో గొల్ల, కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బీరన్న పూజారుల వేషధారణ డప్పుచప్పులు నృత్యాలతో గొల్ల కురుమ కులస్తులు, మహిళలు భారీ ర్యాలీగా బీరన్న దేవాలయానికి బుధవారం చేరుకున్నారు. బీరన్న దేవాలయంలో పూజల అనంతరం గ్రామంలోని పోచమ్మ, మాoకాలమ్మ, వెంకటేశ్వర శివాలయం, భూలక్ష్మి-మా లక్ష్మి, పెద్దమ్మతల్లి, మడెలయ్య, ఎల్లమ్మ దేవాలయాల్లో దేవతామూర్తులకు పాలాభిషేకం, …

Read More »

జమ్మికుంట పట్టణ సీఐని కలిసిన కరీంనగర్‌ జిల్లా సంఘం కమిటీ

తెలంగాణఅక్షరం-జమ్మికుంట ఇటీవల పోలీస్‌ శాఖలో బదిలీలల్లో భాగంగా జమ్మికుంట పట్టణానికి నూతన సీఐగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించగా కరీంనగర్‌ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగరతో పాటు పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతలో పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు కుర్మిండ్ల అశోక్‌ కుమార్‌ సగర, బొడిపెల్లి సదానందం సగర తదితరులు పాల్గొన్నారు.

Read More »

నీరుగారనున్న లక్ష్యం… ”దూరం” కానున్న అంగన్వాడీ సేవలు!

కేంద్రాల తరలింపుపై అధికార యంత్రాంగం చర్యలు గగనకుసుమంగా అందుబాటులో ప్రభుత్వ భవనాలు లబ్ధిదారులకు సేవలు అందటంపై అనుమానాలు గర్భిణీలు, బాలింతలు పోషకాహారానికి దూరమయ్యే అవకాశాలు ఖర్చుల తగ్గింపుకోసం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపాటు తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారనున్నదా.. అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చటం పేర ఇతర ప్రాంతాలకు తరలించటమే ఇందుకు నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్నారులు, మహిళలు, …

Read More »

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(FAC)గా బాధ్యతలు స్వీకరించిన వీ గంగాధర్ ను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో విశిష్ట అనుభవం కలిగిన విద్యావేత్త, విద్యా రంగానికి ప్రశంసనీయమైన సేవలను అందించి ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో ఎన్నో చారిత్రాత్మక విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడే పలు కార్యక్రమాలకు చేయూతనిస్తామని, బోర్డు నియమ నిబంధనలను చక్కగా అమలుపరచి కరీంనగర్ జిల్లా ఖ్యాతిని రెట్టింపు …

Read More »

CBSE ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల విజయకేతనం

తెలంగాణఅక్షరం-హన్మకొండ ప్రతీ పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యార్థుల ప్రభంజనం తప్పనిసరిగా ఉంటుందని ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. కాగా మంగళవారం సీబీఎస్ఈ ఫలితాలల్లో ఉత్తమ మార్కులు సాధించినందుకు విద్యార్థులను ఆయన అభినందించారు.  ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త్, నేడు సీబీఎస్ఈ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మా ఏకశిలా విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయని తెలిపారు. …

Read More »