Blog

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం తెలంగాణ అక్షరం – బాలాపూర్ ఏప్రిల్ 12 ,13 తేదీలలో మహారాష్ట్ర నాగపూర్ లో జరిగే అఖిల భారతీయ మేదరి మహేంద్ర సంఘం ప్రతినిధుల సమావేశానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం బృందం శుక్రవారం బయలుదేరి వెళ్ళింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నటువంటి మన మేదరులను ఎస్టీలో కలపాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం అఖిల భారతీయ సమావేశంలో మద్దతు కూడా కట్టే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ తెలిపారు. బయలుదేరిన …

Read More »

ఘనంగా మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

జ్యోతిబా ఫూలే గారి జీవిత సూత్రాలను ఆదర్శంగా తీసుకుందాం – కొంపల్లి బీజేపీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్ ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే జన్మదినం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కన్వీనర్ డా. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి, విఘ్నేష్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి , అసెంబ్లీ …

Read More »

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

వీణ వంక  : శ్రీ రాములపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుర్మిండ్ల రాజయ్య (78) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం. మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల రాజయ్య 1990-95లో సర్పంచ్ గా గ్రామ ప్రజలకు సేవలందించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాజయ్య గురువారం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. రాజయ్య మృతిపట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

Read More »

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

డీజేఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా తెలంగాణఅక్షరం-పెద్దపల్లి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు, జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనిడెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు మోట పలుకుల వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా, రిలే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోట పలుకుల వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. …

Read More »

పొదుపు సంఘం డబ్బుల పంపిణీ

  తెలంగాణ అక్షరం – బాలాపూర్ బాలాపూర్ మండల పరిధిలోని నాగర్గుల్ గ్రామంలో గురువారం పొదుపు సంఘం డబ్బులను పంపిణీ చేయడం జరిగింది. మహేంద్ర మేదరి యువజన సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు తోకల లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, సంఘంలో జమ ఉన్న రూ. 3 లక్షల 43 వేలను ఎడుగురి సభ్యులకు ఒకొక్కరికి రూ.49 వేలను పంపిణీ చేశారు. ఈ మొత్తాన్ని మూడు నెలల తర్వాత తిరిగి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువకులు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, మనం …

Read More »

పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ గ్యాస్‌ సిలిండర్‌తో కరీంనగర్‌లో నిరసన తెలంగాణఅక్షరం- కరీంనగర్‌ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవ రెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు నగరంలోని తెలంగాణ చౌకలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి గ్యాస్ సిలెండర్ ను నెత్తిన పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …

Read More »

సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలు

తెలంగాణఅక్షరం-ఆత్మకూరు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో ఒరిస్సా రాష్ర్టానికి చెందిన సెంచూరియన్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రామాల్లో వ్యవసాయం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు రకాల పంటలను విశ్వ విద్యాలయ ప్రొపెసర్లు అశోక్‌, హర్షవర్ధన్‌ ల పర్యవేక్షణలో విద్యార్థులు మెండె అంజలి, మెండె ప్రీతి, మందగిరి వరలక్ష్మిపరిశీలించారు. ప్రస్తుత పంటల సస్యరక్షణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సేంద్రీయ వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సేంద్రీయ వ్యవసాయ విధానమే మేలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి …

Read More »

అంతా రామమయం….

కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం జైశ్రీరామ్ నినాదంతో శోభాయాత్ర తెలంగాణ అక్షరం – బాలాపూర్ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఇంటా ప్రతినోటా శ్రీరామ నామస్మరణనే వినిపించింది. వీధి వీధిన సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. బాలాపూర్ మండల పరిధిలోని బాలాపూర్, బడంగ్పేట్, మీర్పేట్, అల్మాస్గూడ, గుర్రం గూడా, నాదర్గుల్ తదితర గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను కళ్ళకు కట్టినట్టు వేద పండితుల మంత్రోచరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాలన్ని కిటకిటలాడాయి.జైశ్రీరామ్ …

Read More »

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గాజులరామారంలో ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ గ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చారు. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్ఛా రణల మధ్య తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిషత్ ప్రాంతాలు కిటకిటలాడాయి. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. సూరారం …

Read More »

చలివేంద్రం ప్రారంభం

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని బాలాజీ లేఅవుట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు కృష్ణ అన్నారు. ఆదివారం గాజులరామారంలో ని ప్రధాన రోడ్డులో ఈగల్ వారియర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ పలువురు కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన ఈగల్ వారియర్స్ సభ్యులను అభినందించారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని …

Read More »