Business

‘రాజీవ్ యువ వికాసం’ ను సద్వినియోగం చేసుకోవాలి

  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నరాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రూ.4 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …

Read More »

మూడు రోజులు వైన్ షాపులు బంద్

తెలంగాణ అక్షరం – హైదరాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Read More »

తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..

రూ.2 కోట్ల నగదు లభ్యం తెలంగాణఅక్షరం, హైదరాబాద్/ వనస్థలిపురం  : నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు.యన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎంఆర్‌ఓ మహేందర్ …

Read More »

మరో వారం చాన్స్..

రూ.2 వేల నోటును మార్చుకునేందుకు అవకాశం గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం TAM NEWS ,ఢిల్లీ : రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి తేదీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కాలాన్ని పొడిగించింది. ఇప్పుడు అది అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించబడింది. ఆర్‌బీఐ ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, రూ. 2,000 డిపాజిట్ మరియు మార్పిడి కాలం నేటితో ముగుస్తుంది. సమీక్ష తర్వాత, ప్రస్తుతం కొనసాగుతున్న రూ. …

Read More »

2000 నోటుకు నేడే ఆఖరి చాన్స్

గడువు పెంచేనా.. తెలంగాణ అక్షరం-హైదరాబాద్ : నేటితో రూ.2,000 నోట్ల మార్పిడి గడువు తీరనుంది. రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ లేదా మార్పిడి చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇందుకోసం సెప్టెంబరు 30ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ వ్యవధిని అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)లోని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు …

Read More »