News

మానేరు పై ఎన్జీటీ తీర్పు హర్షణీయం

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఇసుక మాఫియా పై ఉక్కు పాదం మోపాలి సీఎం రేవంత్ రెడ్డి కి వినతి తెలంగాణ అక్షరం-జమ్మికుంట గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై అధికారులు, నాయకులు ఒక్కొక్కరుగా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చిందని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పేర్కొన్నారు. మానేరు నదిలో ఇసుక త్రవ్వకాలు చట్ట విరుద్ధమని నేడు ఎన్జీటీ తీర్పులో పేర్కొనడం హర్షనీయమని అన్నారు. గత ప్రభుత్వం ఇసుక మాఫియా తో కుమ్మక్కై వేలకోట్ల …

Read More »

క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లించాలి

తెలంగాణ అక్షరం-వీణవంక వరి ధాన్యానికి క్వింటాల్ రూ.500 బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు రాముడి ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వీణవంక మండలంలో ఆకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యలో బిజెపి శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వరి ధాన్యాన్ని ఎలాంటి అంక్షలు లేకుండా, కటింగ్ లేకుండా కొనుగోలు చేసి మద్దతు ధరకు 500 …

Read More »

కాంగ్రెస్లో చేరిన కనపర్తి మాజీ సర్పంచ్ మాజీ ఉపసర్పంచ్

తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన గ్రామ బీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్, బిజెపికి చెందిన తాజా మాజీ ఉపసర్పంచ్ అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి,  కొయ్యడ మొగిలి, రామంచి పూర్ణచందర్, తడిగొప్పుల శ్రీనివాస్, దాసారపు శివలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రణవ్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి కాంగ్రెస్ …

Read More »

కాంగ్రెస్కు ఓటేయండి.. రాజేందర్ రావును గెలిపించండి

తెలంగాణ అక్షరం-వీణవంక ఈనెల 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లను మూడు రోజుల్లో జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు అందరికీ దేవుడని …

Read More »

కాంగ్రెస్లోకి యువ నాయకుడు కిట్టు

తెలంగాణ అక్షరం-వీణవంక హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక గ్రామానికి చెందిన యువ నాయకుడు దాసారపు కృష్ణ కాంత్ (కిట్టు) కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వివిధ గ్రామాల్లోని ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. యువకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే యువకులతోనే పార్టీ మరింత బలపడేందుకు దోహదపడుతుందని కృష్ణకాంత్ …

Read More »

కాంగ్రెస్ లోకి యువ నాయకుడు కృష్ణ కాంత్(కిట్టు)

తెలంగాణ అక్షరం-వీణవంక హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక గ్రామానికి చెందిన యువ నాయకుడు దాసారపు కృష్ణ కాంత్ (కిట్టు) కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వివిధ గ్రామాల్లోని ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. యువకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే యువకులతోనే పార్టీ మరింత బలపడేందుకు దోహదపడుతుందని కృష్ణకాంత్ …

Read More »

కాంగ్రెస్ లోకి గంగాడి

బిఆర్ఎస్ కు బిగ్ షాక్ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ సమక్షంలో పార్టీ మారిన తిరుపతిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పర్యటన రోజున కాంగ్రెస్లోకి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వలస వెళ్లారు. తాజాగా నర్సింగపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా …

Read More »

తోటి స్నేహితుల ఔదార్యం

తెలంగాణ అక్షరం-వీణవంక తమతో కలిసి చదువుకున్న తోటి స్నేహితుడు అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడంతో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన రాంపల్లి సాయికుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (1996-97 పదవ తరగతి బ్యాచ్) చదువుకున్నాడు. సాయి కుమార్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సాయికుమార్ అనారోగ్యానికి గురై మృతి చెందడంతో వారి కుటుంబానికి అండగా నిలవాలని తోటి స్నేహితులు అందరూ కలిసి రూ.51,500 లు జమ చేసి, సోమవారం …

Read More »

మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తెలంగాణ అక్షరం-జమ్మికుంట, వీణవంక జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు వచ్చి వడదెబ్బతో వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర భగవాన్ …

Read More »