News

వీణవంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల ఎన్నిక

  తెలంగాణఅక్షరం-వీణవంక సంస్కృతిక సంస్థల కళాకారుల మండల కమిటీని ఆ సంఘం హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తాండ్ర శంకర్ అధ్యక్షతన ఆదివారం ఎన్నకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళా వైభోగాలను చక్కగా ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్య వంతం చేయడంలో ఆనాటి కళాకారులు ముందడుగు ఉండేవారని అన్నారు. ప్రస్తుతం కళాకారులకు ప్రోత్సాహం లేక కళలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్ చేశారు. అంతేకాకుండా ప్రోత్సాహం లేకుండా ఉండడంతో వారి మనుగడ కరువవుతుందని వాపోయారు. ప్రస్తుతం కళలను ప్రోత్సహించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం …

Read More »

ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు

తెలంగాణఅక్షరం-వీణవంక ఓ యువతిని వేధింపులకు గురిచేసిన మండల కేంద్రానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అన్వర్ పాషా అనే ఆర్ఎంపీ క్లీనిక్ ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తున్నాడు. కాగా గత సంవత్సరం క్రితం శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవివాహిత యువతి అతడి వద్ద కొంత కాలం పాటు పని చేసి మానేసింది. అయితే ఇటీవల మళ్లీ తన వద్ద పని చేయాలని …

Read More »

బిగ్ బ్రేకింగ్ :   గ్రూప్ -1 పరీక్షలు రద్దు

    తెలంగాణ అక్షరం-హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను హై కోర్టు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. ఇక, గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా …

Read More »

రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నాం

డీ గ్రేడ్ లో ఉన్న సొసైటీని ఏ గ్రేడ్ లోకి తీసుకొచ్చాం పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక డీ గ్రేడ్ లో ఉన్న వీణవంక సొసైటీని తమ పాలకవర్గంలో ఏ గ్రేడ్ లోకి తీసుకొచ్చామని, రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, పాలకవర్గం సహాయ సహకారాలతో సొసైటీని లాభాల్లో నడిపిస్తున్నట్లు తెలిపారు. రైతులు …

Read More »

రాజమల్లు సేవలు మరువలేనివి

పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక పీఏసీఎస్ లో సిబ్బందిగా పనిచేసిన రాజమల్లు సేవలు మరువలేనివని పీఏసీఎస్ చైర్మన్ మావరుపు విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. సొసైటీలో పనిచేస్తున్న మ్యాకల రాజమల్లు ఇటీవల రిటైర్డ్ అయ్యారు. కాగా ఆయనకు శుక్రవారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ పాలకవర్గం, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు రాజమల్లు-యాదమ్మ దంపతులను పూలమాలతో సన్మానించి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాజమల్లు సుధీర్ఘంగా పనిచేసిన అనుభవంతో సొసైటీలో …

Read More »

ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం

ఎప్పుడు ప్రకటించనున్నారంటే.. _ డిసెంబరు తొలివారంలో పోలింగ్‌ _వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం పర్యటన _వీరి నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం _ఓటర్ల జాబితాపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తి _అక్టోబరు 4న తుది జాబితా విడుదల  తెలంగాణ అక్షరం-హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు 6న షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. దాంతో.. ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే.. 2018లో.. డిసెంబరు …

Read More »

ఉద్యోగి, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

సూపరింటెండెంట్ భాస్కర్ సేవలు మరువలేనివి ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి   తెలంగాణఅక్షరం -వీణవంక   ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ గాజుల భాస్కర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేపట్టగా ఆయనకు గురువారం ఘనంగా సత్కరించారు. ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ సూపరింటెండెంట్, ఇన్చార్జి ఎంపీడీవోగా భాస్కర్ చేసిన సేవలు గొప్పవని అన్నారు. ఆయన పనిపట్ల నిబద్దతో వ్యవహరిస్తూ తోటి ఉద్యోగస్తులతో సన్నిహితంగా …

Read More »

ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి

ఎరువుల దుకాణంను ఆకస్మికంగా తనిఖీ చేసిన హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలంగాణఅక్షరం -హనుమకొండ కాజీపేట లో ఎరువుల దుకాణంను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను,స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు,స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని దుకాణ యజమానులకు సూచించారు. అనుమతుల్లేని నాసిరకం ఎరువులు విత్తనాలు,పురుగుమందులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని అన్నారు.డిఎపిని అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.రైతులకు విక్రయించిన ఉత్పత్తులకు సంబంధించి …

Read More »

జాతీయస్థాయి సైన్స్ సెమినార్ కు ఏకశిల విద్యార్థిని ఎంపిక

తెలంగాణ అక్షరం- హన్మకొండ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ) హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్- 2023లో పాల్గొన్న ఏకశిలా విద్యార్థిని పి. హన్సిక ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సంపాదించి జాతీయస్థాయికి ఎంపికైనట్లు ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్. మాధవి గైడ్ టీచరుగా వ్యవహరించిన “Millets-A Super Food or a Diet Fad”? ( సిరి ధాన్యాలు సంపూర్ణ ఆహరమా లేదా ఆహార వ్యమోహమా) …

Read More »