News

కరీంనగర్ జిల్లా ఇంచార్జ్త్రిగా ఉత్తమ్

ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం తెలంగాణ అక్షరం-హైదరాబాద్ బ్యూరో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం చేపట్టారు.   ఉత్తమ్-కరీంనర్, దామోదర రాజనర్సింహ-మహబూబ్నగర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి-ఖమ్మం, పొంగులేటి-వరంగల్, శ్రీధర్ బాబు-రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్-హైదరాబాద్, కొండా సురేఖ-మెదక్, సీతక్క-ఆదిలాబాద్, తుమ్మల-నల్గొండ, జూపల్లి కృష్ణారావు-నిజామాబాద్కు నియమించారు.

Read More »

మానేరు విధ్వంసంపై విచారణ చేపట్టాలి

ఇసుక క్వారీని సందర్శిస్తున్న తుమ్మేటి సమ్మిరెడ్డి  

ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక మానేరు విధ్వంసంపై, ఇసుక క్వారీల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మానేరు తీరం వెంట ఉన్న కొండపాక ఇసుక క్వారీని ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో డిసిల్టేషన్ పేరుతో …

Read More »

ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సీఎం సమావేశం

తెలంగాణఅక్షరం-హైదరాబాద్ బ్యూరో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం …

Read More »

27కు చేరిన కరోనా కేసులు..

హైదరాబాద్‌లో మరో 8 మందికి పాజిటివ్   తెలంగాణ అక్షరం-హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు ప్రకటించింది.దీంతో.. కరోనా యాక్టివ్ కేసులు 27 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. హైదరాబాద్‌లో 8 మందికి, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు.తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ …

Read More »

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా హిమ్మత్ నగర్ లో ఘటన తెలంగాణఅక్షరం-వీణవంక అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఎండి ఆసిఫ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మ్యాక శ్రీనివాస్ వ్యవసాయం తో పాటు ఇద్దరు పిల్లల చదువుకు సుమారు రూ. 8 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియక జీవితం విరక్తి చెంది పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం …

Read More »

ఏకశిల లో ప్రీ క్రిస్మస్ వేడుకలు

తెలంగాణఅక్షరం-హనుమకొండ రెడ్డి కాలనీలోని ఏకశిలా కాన్సెప్ట్ స్కూల్ లో ప్రీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఘనoగా జరిగాయి. ఈ సందర్భoగా ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ గౌరు.తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో అన్నీ మతాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో తమ పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహిస్తునట్లు తెలిపారు.మతాలు వేరైన సోదరబావంతో కలిసి మెలసి మెలగాలని సూచిoచారు. నేటి తరానికి క్రీస్తు భోధనలు అనుసరణీయం అన్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు,ఉపాద్యాయులు కలిసి యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశంగా గడ్డితో పాకను నిర్మించి,యేసు ప్రతిమను, క్రిస్మస్ ట్రీ …

Read More »

రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి

వైద్యులను ఆదేశించిన మంత్రి సీతక్క రోడ్డు ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ అక్షరం-హైదరాబాద్ ఏటూరునాగారం మండలానికి చెందిన ఏడుగురు కారులో వేములవాడ దర్శనానికి వెళుతుండగా శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో లారీ కారును ఢీకొన్న ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తూ వరంగల్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం

 ఒకే కుటుంబానికి చెందిన‌ న‌లుగురి దుర్మ‌ర‌ణం వరంగ‌ల్ -క‌రీంన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ ఏటూరునాగారంలో తీవ్ర విషాదం తెలంగాణ అక్షరం-హన్మకొండ హ‌న్మ‌కొండ జిల్లా ఎల్క‌తుర్తి మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పెంచికల్ పేట శివారులో వ‌రంగ‌ల్ – క‌రీంన‌గ‌ర్‌జాతీయ ర‌హ‌దారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెంద‌గా.. మ‌రో ముగ్గురు తీవ్ర గాయాల‌తో వ‌రంగ‌ల్ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లానికి చెందిన మంతెన కాంతయ్య(72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), …

Read More »

పోతిరెడ్డిపల్లిలో పరిపాటి జన్మదిన వేడుకలు తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదినాన్ని వీణవంక మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ గ్రామ అధ్యక్షుడు గజ్జల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ వీణవంక మండలంలోని వివిధ గ్రామాల్లో మరియు పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎంతో మంది నిరుపేద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద …

Read More »