2003-2004పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తెలంగాణఅక్షరం, వీణవంక వీణవంక మండల ప్రాథమిక కొన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థులు 2003-2004 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీణవంక లో ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి తమ …
Read More »News
తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
రూ.2 కోట్ల నగదు లభ్యం తెలంగాణఅక్షరం, హైదరాబాద్/ వనస్థలిపురం : నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు.యన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎంఆర్‌ఓ మహేందర్ …
Read More »మరో వారం చాన్స్..
రూ.2 వేల నోటును మార్చుకునేందుకు అవకాశం గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం TAM NEWS ,ఢిల్లీ : రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి తేదీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కాలాన్ని పొడిగించింది. ఇప్పుడు అది అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించబడింది. ఆర్‌బీఐ ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చిందో తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, రూ. 2,000 డిపాజిట్ మరియు మార్పిడి కాలం నేటితో ముగుస్తుంది. సమీక్ష తర్వాత, ప్రస్తుతం కొనసాగుతున్న రూ. …
Read More »2000 నోటుకు నేడే ఆఖరి చాన్స్
గడువు పెంచేనా.. తెలంగాణ అక్షరం-హైదరాబాద్ : నేటితో రూ.2,000 నోట్ల మార్పిడి గడువు తీరనుంది. రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇందుకోసం సెప్టెంబరు 30ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ వ్యవధిని అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)లోని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు …
Read More »చికిత్స పొందుతూ యువకుడి మృతి
– తమ వివాహేతర సంబంధాలపై బెదిరించిన ఇద్దరు వ్యక్తులు – తనకే అంటగడుతూ ప్రచారం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ కుటుంబీకుల ఆరోపణ – నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంధువుల ఆందోళన తెలంగాణఅక్షరం-వీణవంక/జమ్మికుంట వివాహేతర సంబంధాలపై ప్రచారం చేస్తున్నావనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులు బెదిరించారనే నెపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కనపర్తి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన బొంగోని కార్తిక్ …
Read More »సామాజిక న్యాయం జరగాలంటే బహుజన రాజ్యం కోసం పోరాడాలి
తెలంగాణ అక్షరం -హనుమకొండ : సామాజిక న్యాయం జరగాలంటే బహుజన రాజ్యం కోసం పోరాడాలని సామాజిక న్యాయవేదిక జిల్లా అధ్యక్షులు దామేరుప్పుల శంకర్ అన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రం లో సామాజిక న్యాయవేదిక జిల్లా సమావేశానికి జిల్లా అధ్యక్షులు దామేరుప్పుల శంకర్ శాలివాహన అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయనమాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలలో చదివే విద్యార్థులకు కేజీ నుండి 10 తరగతి వరకు స్కాలర్ షిప్స్ ఫీజ్ రిఎగ్యాంబర్స్ …
Read More »ఎంఎస్ స్వామినాథన్ మృతి
తెలంగాణ అక్షరం -హైదరాబాద్ భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి వున్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని …
Read More »30 న హుజూరాబాద్ లో ధర్నా
సర్వాయి పేటలోని పాపన్న గుట్టలను కాపాడాలి హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు గీత కార్మికులు తరలిరావాలి తెలంగాణఅక్షరం-వీణవంక సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో ఉన్న పాపన్న గుట్టల నుండి ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాల అనుమతిని నిరసిస్తూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించే ధర్నా కార్యక్రమానికి గీతా కార్మికుల అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ సంఘం మండల అధ్యక్షులు బొంగుని రాజయ్య దొమ్మటి రాయమల్లు కోరారు. మండల కేంద్రంలోని ఈ …
Read More »శ్రీ వరసిద్ధి వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజ, మహా అన్నదానం
తెలంగాణఅక్షరం-హనుమకొండ : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 56వ డివిజన్, సప్తగిరి కాలనీ లో మంగళవారం రోజున శ్రీ వరసిద్ధి వినాయక భక్త మండలి కమిటీ అధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు.శ్రీ వరసిద్ధి వినాయక భక్త మండలి కమిటీ అధ్వర్యంలో కొలువుదీరి పూజలందుకుంటున్న గణనాధునికి నైవేద్యాలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుకూలంగా మట్టి విగ్రహాలను …
Read More »ట్రై సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..
రేపు గణేశ్ నిమజ్జన మహోత్సవం వివరాలు వెల్లడించిన సీపీ ఏవీ రంగనాథ్ తెలంగాణ అక్షరం, హన్మకొండ క్రైమ్ వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని బుధవారం (రేపు) గ్రేటర్ వరంగల్ పరిధిలో శోభాయాత్ర నిర్వహించబడుతుందని, దీంతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ట్రైసిటీ పరిధిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ మంగళవారం వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా …
Read More »