News

మర్రి స్వామియాదవ్ కు పలువురి పరామర్శ

తెలంగాణఅక్షరం-వీణవంక కోర్కల్ మాజీ సర్పంచ్ మర్రి స్వామి యాదవ్ కు మాతృవియోగం కాగా ఆయనను బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు నాగరపు సత్యనారాయణ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మంచాల రవీందర్, మల్లేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నేబోయిన రవి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గెల్లు మల్లయ్య యాదవ్, హుజురాబాద్ మండల అధ్యక్షులు బద్దుల …

Read More »

విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించాలి

తెలంగాణ అక్షరం-హసన్ పర్తి జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హాసన్ పర్తి ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ మీటింగ్ కి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ మరియు క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు అందరికీ కూడా తగు సూచనలు చేశారు. స్కూల్లో పిల్లల సంఖ్యను పెంచి అదేవిధంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాలను విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చేయాలని సూచించారు ,అదేవిధంగా న్యాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే, మాక్ టెస్ట్ కూడా …

Read More »

ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

సందడి చేసిన కీర్తి సురేష్ నాగోల్ తో పాటు కర్నాటకలోనూ త్వరలో ప్రారంభం తెలంగాణ అక్షరం- హైదరాబాద్ హైదరాబాదు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను సినీ నటి కీర్తి సురేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో అతిపెద్ద షాపింగ్ షాపింగ్ మాల్ గా అవతరించిందనీ ఈ స్టోర్ ను నేను ప్రారంభించడం ఆనందంగా ఉందని, పట్టు ఫ్యాన్సీ …

Read More »

తుమ్మేటి కుటుంబానికి కొమ్మిడి పరామర్శ

  తెలంగాణఅక్షరం-వీణవంక జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.  ఈ సందర్భంగా సమ్మిరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నల్ల కొండాల్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ తిరుమల్, సమ్మిరెడ్డి, సతీష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Read More »

శునకం.. విశ్వాసం..

యజమాని తుమ్మేటి మృతితో కుక్క కన్నీటి పర్యంతం సమ్మిరెడ్డి చిత్రపటం వద్ద బోరున విలపిస్తున్న శునకం తెలంగాణ అక్షరం-జమ్మికుంట విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తుంది శునకం. తనకు అన్నం పెట్టి సాకిన యజమాని అంటే అమితమైన అభిమానం చూపిస్తుంది. ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అండగా ఉంటుంది. అలాంటి స్వామి భక్తికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన. తన యజమాని  కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మేటి తమ్మి రెడ్డి ఇటీవల కాలం చేయడంతో నిద్రాహారాలు మరిచి …

Read More »

ఏకశిల లో మట్టి గణపతులపై అవగాహన

తెలంగాణ అక్షరం- హన్మకొండ రెడ్డి కాలని లోని ఏకశిల కాన్సెప్ట్ స్కూల్ లో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మట్టి విగ్రహాలని పూజించాలని,పర్యావరణానికి మేలు చేసే విధంగా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కృత్రిమమైన,విషపూరిత రసాయనాలతో కూడిన విగ్రహాలను పూజించడం పర్యావరణానికి చేటు చేయడమే అని పేర్కొన్నారు.పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని విద్యార్థులకు తెలియచేసా రు.విద్యార్థులు స్వయంగా మట్టి మరియు పిండి తో తయారు చేసిన …

Read More »

హాసన్ పర్తి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

  తెలంగాణ అక్షరం-హాసన్ పర్తి స్థానిక మసీదు ఆవరణలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి ఈసరి రవీందర్ సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజనాన్ని, గ్రంథాలయ పుస్తకాలను వినియోగమును,పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. నూతనంగా వచ్చిన విద్యాశాఖ అధికారికి పిల్లలు స్వాగతం పలికారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ అలైన్మెంట్ పాటించాలని, విద్యార్థులచే ప్రతిరోజు వర్క్ బుక్కులు రాయించాలని, గ్రంథాలయ పుస్తకాలు చదివించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, నేషనల్ అచీవ్ మెంట్ …

Read More »

మల్లారెడ్డిపల్లిలో కూలిన ఇల్లు

అప్రమత్తమైన బాధితులు 5తప్పిన ప్రమాదం తెలంగాణ అక్షరం వీణవంక గత మూడు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిమ్మల రాజయ్య ఇల్లు ఆదివారం రాత్రి కూలి నీలమట్టమయింది. ఈ సమయంలో నిద్రిస్తున్న రాజయ్య దంపతులు అప్రమత్తమై వెళ్లారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ సందర్భంగా భావిస్తూ కుటుంబం మాట్లాడుతూ నిరుపేద కుటుంబం రోడ్డున పడ్డామని రోధించారు. ప్రభుత్వం స్పందించి తమను  ఆదుకోవాలని కోరారు.

Read More »

కరీంనగర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలంగాణ అక్షరం-కరీంనగర్ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నెంబర్.+91 878 299 7247 తో బాటు వాట్సాప్ నెంబర్ ను +91 81251 84683ను సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్ లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ లో వెల్లడించారు.

Read More »