Telangana

వీణవంక శాలివాహన సంఘం మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల శాలివాహన సంఘం నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మండల అధ్యక్షుడిగా మందారపు నరేష్, ఉపాధ్యక్షులుగా కొలిషెట్టి మొండయ్య, నల్లవెల్లి సంపత్, ప్రధాన కార్యదర్శిగా తాటికంటి తిరుపతి, కార్యదర్శులుగా ఇజిగిరి నరేష్, సిలివేరి విజయ్ ను ఆ సంఘం నాయకులు ఎన్నికున్నారు. ఈ సందర్భంగా నూతనంగా కమిటీని మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కులసంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read More »

ఎనిమిదో రోజుకు చేరిన మార్క సురేష్‌ పాదయాత్ర

యాత్రకు సంఘీభావం తెలిపిన పలువురు సగర నాయకులు తెలంగాణఅక్షరం-హన్మకొండ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రాముడి కల్యాణం కోసం పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సగర సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కాగా ఈ యాత్ర 250కి.మీ పూర్తి చేసుకుని ఖమ్మ జిల్లాలోని ఏన్కూరు చేరింది. కాగా ఈ పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి …

Read More »

హెచ్ సి యూ భూములను కాపాడాలి

పోలీస్ నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు CPM జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ… సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక వద్ద జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీస్ వేషధారణలో నాయకులకు సంకెళ్లు వేసి లాక్కెళ్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం …

Read More »

ఏడో రోజుకు చేరిన భద్రాచలం మహా పాదయాత్ర

తెలంగాణఅక్షరం-ఖమ్మం భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్ సగర చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం నాటికి ఏడో రోజుకు చేరింది. ఈ యాత్ర ఏడో రోజు ఖమ్మం జిల్లాలో ప్రవేశించగా ఆ జిల్లాకు చెందిన సగరులు ఈ సందర్భంగా సురేషన్‌ ను పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సురేష్‌ సగర మాట్లాడుతూ తాము భగీరథ మహర్షి, శ్రీరాముని వంశీయులమని, భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి తామే తలంబ్రాలు అందించేలా ప్రభుత్వం …

Read More »

మీ సేవల దోపిడీ

జిల్లా వ్యాప్తంగా భారీగా వసూళ్లు.. పట్టించుకోని ఈడీఎం, అధికారులు ఈడీఎంను మార్చాలని ప్రజల డిమాండ్ తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీ సేవ సెంటర్లలో వసూళ్ల పర్వం సాగుతోంది. ఈడీఎం, డీఎంతో పాటు తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు సెంటర్లంటే నిర్వాహకుల ఇష్టారాజ్యం అనుకోవచ్చు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగుతుందటే ఖచ్చితంగా అధికారుల వైఫల్యమే కారణమని అంటున్నారు. మీ సేవ సెంటర్లలో తనిఖీలు చేసిన అధికారులు.. మళ్లీ అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఇలా …

Read More »

స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు

ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు. తెలంగాణ అక్షరం – హుజురాబాద్ కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లుపై పాలకులకు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ పబ్బం గడుపుకునే కంటి తుడుపు చర్యలు మాత్రమే నని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామా రావు ఆరోపించారు. మంగళవారం హుజురాబాద్ లో మీడియా ప్రతినిధులతో పోలాడి రామారావు మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ల పై చిత్తశుద్ది …

Read More »

WARDANNAPETA | రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు

రంజాన్ సందర్బంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలంగాణఅక్షరం-వరంగల్‌ WARDANNAPETA | రంజాన్ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మామునూర్ లక్ష్మిపురం గ్రామంలోని ఈద్-గా-గుల్షన్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ మానవ సేవ, సోదరభావానికి ప్రతీక అని, ఉపవాసాలు, ప్రార్థనలు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తన బాల్యం ఇదే ప్రాంతంలో గడచిందని, హాకీ ఆటగాడిగా అంతర్జాతీయ …

Read More »

DELHI | ఢిల్లీ బయల్దేరిన తెలంగాణ సగరులు

పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలితెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర   తెలంగాణఅక్షరం-హైదరాబాద్‌/కుత్బుల్లాపూర్‌/ఖాజీపేటDELHI | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే బీసీ గర్జన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తెలంగాణ సగరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బయలుదేరారు. ఏప్రిల్ 2న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీల పోరు గర్జన సభను విజయవంతం చేయడం …

Read More »

మున్సిపాలిటీ కార్మికులకు టోపీల పంపిణీ

కొంపల్లి పట్టణ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి -పెద్దబుద్దుల సతీష్ సాగర్మున్సిపాలిటీ కార్మికులకు టోపీలు ఇవ్వడం అభినందనీయం – కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్రాబోయే ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు ఎండ తీవ్రతకు తట్టుకొనేందుకు వీలుగా సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు టోపీలను అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణరెడ్డి , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలకు రక్షణగా మున్సిపాలిటీ కార్మికులకు …

Read More »

ఆశల అరెస్టు సరికాదు

ఆశల అరెస్టును ఖండించిన జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి. వీణవంక : హైదరాబాద్ లో నిరసన కార్యక్రమానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడాన్ని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వీణవంకలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.రాష్ట్రంలో ప్రజలతోపాటు ఉద్యోగులు నిరసన తెలిపే …

Read More »