తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మహా గణపతి, పార్వతీ దేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఈ నెల 16 నుండి 19 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షురాలు వాల శైలజబాలకిషన్ రావు తెలిపారు. ఆ ఆలయంలో ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 16న గోపూజ, రథయాత్ర, గ్రామ పర్యాటన శోభయాత్రతో పాటు పలు పూజలు, 17న రుద్ర పారాయణం, …
Read More »Telangana
కలసికట్టుగా పని చేసి పార్టీని బలోపేతం చేయాలి
కాంగ్రెస్ కార్యకర్తలో జోలికొస్తే ఊరుకోబోం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు తెలంగాణఅక్షరం-వీణవంక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరూ వచ్చినా ఊరుకునేది లేదని, పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాలులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ లో చేరగా వారికి ప్రణవ్ బాబు కంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »కారుపై లారీ బోల్తా ఒకరి మృతి
నుజ్జు నజ్జాయిన కారు పలువురికి గాయాలు.. వేములవాడకు వెళ్లి వస్తుండగా ఘటన తెలంగాణ అక్షరం, హనుమకొండ క్రైమ్ గీసుగొండ పొలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వెళుతున్న లారీ కారు పైన పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. తీర్ధయాత్రల కోసం వేములవాడకు వెళ్లి వస్తున్న క్రమంలో లక్నపల్లి,రామారం గ్రామాల మధ్య నర్సంపేట రహదారి పై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి
మహేందర్ రెడ్డిని నియమించిన గవర్నర్ తెలంగాణ అక్షరం, బ్యూరో: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. దీంతో ఆయన టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకుముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Read More »ఒక్క కొడుకు ఉంటే కీడట..!
ఒక్క కొడుకు ఉంటే కీడు … పండుగ వేళ జోరుగా వదంతులు గాజుల దుకాణాల గల్లా పెట్టే గలగల….? తెలంగాణఅక్షరం-హైదరాబాద్ బ్యూరో సంక్రాంతి పండుగ కీడుతో వచ్చిందని, ఒక్క కొడుకు ఉన్న మహిళలకు ఈ పండుగ కీడు చేస్తుందనే వదంతులు జోరుగా వ్యాపిస్తున్నాయి. మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు సమాజంలో ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే వదంతులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . ఒక్క కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని లేదంటే వారికి కీడు తప్పదు అంటూ ప్రచారం గ్రామాలలో జోరుగా పాకుతుంది. ఒక్క …
Read More »పంటల సస్యరక్షణకు చర్యలు చేపట్టాలి
ఎఫ్ఎంసీ కంపెనీ రిజినల్ మార్కెటింగ్ మేనేజర్ మణిచందర్ కన్నూరులో రైతులకు అవగాహన సదస్సు తెలంగాణఅక్షరం-కమలాపూర్ పంటల సస్యరక్షణకు చర్యలు చేపట్టాలని ఎఫ్ఎంసీ కంపెనీ రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ మణిచందర్ అన్నారు. మండలంలోని కన్నూరు గ్రామంలో రైతులకు కంపెనీ ప్రతినిధులు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గులికలతో మెక్కలు ఏపుగా పెరుగుతాయని, పిలకలు ఎక్కువగా వచ్చి ధృడంగా పెరుగుతాయని చెప్పారు. అలాగే మొక్కలకు మొగిపరుగు, తెగుళ్లు, పోషకలోపాల వచ్చే వ్యాధులు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. దీనికి కంపెనీకి …
Read More »ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం సమీక్ష
ప్రజాపాలనలో1,25,84,383 దరఖాస్తులు తెలంగాణ అక్షరం-హైదరాబాద్, జనవరి 7 : గత నెల 26 తేదీనుండి ఈనెల 6 వతేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన లో అందిన దారకాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారంనాడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, …
Read More »తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
తెలంగాణ అక్షరం-వీణవంక తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు. చల్లూర్ లో ఆయన ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి వాహన చోదకులకు బ్రీతింగ్ ఎనలైజర్ చే పరీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాన్ని నడిపినట్లు అయితే చర్యలు ఉంటాయని చెప్పారు.
Read More »అట్రాసిటీ కేసు నమోదు
తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని మామిడాల పల్లి గ్రామానికి చెందిన కనకం వెంకటస్వామిని చల్లూరు గ్రామానికి చెందిన నల్లవెల్లి తిరుపతి కులం పేరుతో దూషించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కనకం వెంకటస్వామి తన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టుతుండగా తిరుపతి పనులు ఆపాలని కులం పేరుతో దూషించారు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Read More »అర్హులైన మహిళలకు రూ.2500..?
తెలంగాణఅక్షరం-హైదరాబాద్ మరో హామీ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయడంపై సీఎం రేవంత్ ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని సూచించినట్లు సమాచారం.
Read More »