Telangana

వివేకవంతమైన విద్యార్థులే, దేశానికి బలం- బలగం

రిటైర్డ్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల కలలకు నిలయాలు విద్యాసంస్థలు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు  తిరుపతి రెడ్డి ఘనంగా ఏకశిలా పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు వివేకవంతమైన విద్యార్థులే దేశానికి బలం, బలగమని రిటైర్డ్ సీబీఐ జేడీ, జేడీ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు. ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలను పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిలా టెక్నో స్కూల్, హసన్పర్తిలో ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

తెలంగాణ రాష్ట్ర సగర సంఘ రాష్ట్ర సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అక్షరం- హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సగర సంఘ సమావేశాలు హైదారాబాద్ సమీపం ఇబ్రహీంపట్నం (నోముల) లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత ఆ సంఘం కుల దైవమైన భగీరథ మహర్షి కి పూల మాల వేసి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి ఆత్మ శాంటించాలని కోరుతూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. సమావేశం ప్రారంభించారు. తొలుత …

Read More »

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

తపస్ మండల అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి క్యాలెండర్ ఆవిష్కరించిన ఉపాధ్యాయులు తెలంగాణ అక్షరం-హసన్ పర్తి ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్ ) హసన్ పర్తి మండల శాఖ అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి డిమాండ్ చేశారు. తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 DA లను …

Read More »

సురక్షలో అరుదైన చికిత్స

  తెలంగాణ అక్షరం- జమ్మికుంట జమ్మికుంట పట్టణం లో నీ సురక్ష మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి లో ఓ మహిళకు అరుదైన చికిత్స చేశారు. వైద్యుల కథనం ప్రకారం.. 44 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ దావఖానకు వచ్చింది. కాగా వైద్యురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించి మహిళ కడుపులో మూడు కిలోల కణతి ఉన్నట్లు గుర్తించి చికిత్స నిర్వహించి తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులకు బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

ఘనంగా పరిపాటి జన్మదిన వేడుకలు

తెలంగాణ అక్షరం-వీణవంక భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మ్యడగోని భరత్, రాపర్తి అరవింద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో చదివిస్తున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు యార కుమార్, అంబాల శ్రావణ్, మిడిదొడ్డి …

Read More »

సతీష్ కు ప్రణవ్ అభినందన

తెలంగాణఅక్షరం-వీణవంక ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలల్లో మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోతరవేన సతీష్ కుమార్ మండల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా సతీష్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదివారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మండలంలోని యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువతను సిద్ధం చేయాలని సూచించారు. అలాగే మండలంలోని లస్మక్కపల్లి గ్రామాభివృద్ధికి …

Read More »

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి సూచన మేరకు రాకేష్ అన్న సైన్యం సభ్యులు మృతుడి కుటుంబానికి 50 కేజీల అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ అన్న యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్, సంపత్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, గురువారెడ్డి మధుసూదన్, శ్యామ్, కుమార్, సాయికిరణ్, సోయల్, సమ్మయ్య, లక్ష్మణ్, పరిపూర్ణాచారి, సమ్మయ్య, శ్రీకాంత్, కార్తీక్, సమ్మయ్య, …

Read More »

నేడు చెక్కుల పంపిణీ

తెలంగాణ అక్షరం- వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం ఉంటుందని లబ్ధిదారులందరూ మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవాలని సూచించారు.

Read More »

మధ్యాహ్న భోజనంలో శుభ్రత పాటించాలి

తెలంగాణఅక్షరం-వీణవంక మధ్యాహ్న భోజనం విషయంలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలని వీణవంక ఎంఈవో సుద్దాల శోభారాణి సూచించారు. మండలంలోని పలు పాఠశాలలు, మోడల్  స్కూల్, కస్తూర్బా పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులకు శుక్రవారం ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగూణంగా తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ శుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రతినిధులు పులి అశోక్ కుమార్, సంతోష్ కుమార్, నాగిరెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులు,  పాల్గొన్నారు.

Read More »

దీక్షా దివాస్ విజయవంతం చేయాలి

వీణవంక మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించతలపెట్టిన  దీక్షా దివాస్ కార్యక్రామాన్ని విజయవంతం చేయాలని వీణవంక మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ అక్షరంతో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కరీంనగర్ జిల్లా కీలకంగా వ్యవహరించిందని, మాజీ సీఎం కేసీఆర్ ను అలుగునూరులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని గుర్తు చేశారు. దీనికి గుర్తుగా రాష్ట్రమంతటా దీక్షా …

Read More »