Telangana

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

తెలంగాణ అక్షరం – మంథని, పెద్దపల్లి కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లామంథని మండలంలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు, గ్రామస్థులు భావిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ సంగీతలకు …

Read More »

ప్లాష్.. ప్లాష్.. పేకాటరాయుళ్ల అరెస్టు

చల్లూరులో ఆరుగురి పట్టవేత తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. చల్లూరు గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద ఉన్న నగదు రూ.5500, పేక ముక్కలను స్వాధీనపరుచుకున్నట్లు పేర్కొన్నారు.  

Read More »

అక్రమార్కులకు సహకరించిన సీఐ, ఎస్సై సస్పెండ్

తెలంగాణఅక్షరం- నర్మెట, జనగామ భూ సమస్య విషయంలో బాధితులపై  అక్రమ కేసులు నమోదు చేసి బాధిత వ్యతిరేకులకు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, నర్మెట్ట ఎస్ఐ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వి రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ తగాదా విషయంలో ముప్పై సంవత్సరాలుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని  కేవలం ధరణి పోర్టల్ ఉన్నదనే సాకుతో పోలీస్ ద్వారా భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించెందుకు స్థానిక సర్కిల్ …

Read More »

రేపటి ముదిరాజుల ఆత్మగౌరవ మహాసభను విజయవంతం చేయాలి

తెలంగాణఅక్షరం-వీణవంక హైదరాబాద్ లోని సర్కస్ గ్రౌండ్ లో ఆదివారం నిర్వహించే ముదిరాజ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ముదిరాజుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొలిపాక తిరుమల్ ముదిరాజ్ కోరారు. మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని, ముదిరాజులకు ముదిరాజు బంధు ఇవ్వాలని, రూ.5లక్షల వరకు ఇన్సూరెన్స్, పింఛన్ విధానాన్ని అమలు చేయాలనే తదితర డిమాండ్లతో ఈ సభ …

Read More »

చల్లూరులో బీజేపీకి షాక్

బీజేపీ మండల నాయకత్వం తీరు నచ్చక బండి సంజయ్ ముఖ్య అనుచరుడి రాజీనామా.. జమ్మికుంట ఏఎంసీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక తెలంగాణఅక్షరం-వీణవంక (చల్లూరు) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, ఆ పార్టీ అనుబంధ సంఘమైన భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షుడు, నారాయణదాసు గోపీకి ఆ పార్టీ మండల నాయకత్వం తీరు నచ్చక బీజేపీకి శనివారం రాజీనామా  చేశారు. ఆ తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ …

Read More »

తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా తిరుమల్

తెలంగాణఅక్షరం-వీణవంక తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొలిపాక తిరుమల్ ముదిరాజ్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుమల్ మాట్లాడుతూ ముదిరాజుల సమస్యలపై పోరాడుతూ ముదిరాజుల ఐక్యతను పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, సర్పంచ్ ఎం సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ లతశ్రీనివాస్, సర్పంచ్ సమ్మిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర అధ్యక్షుడు అప్పని హరీష్, ఉప సర్పంచ్ దుడపాక రాజ కొండయ్య, వార్డు సభ్యులు …

Read More »

9న పశు సంవర్దక శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి

తెలంగాణ అక్షరం-వీణవంక గొర్రెలు, మేకల పంపకందారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 9న తెలంగాణ పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి రవియాదవ్ తెలిపారు. మండలంలోని చల్లూరు గ్రామంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం సబ్సిడితో అందిస్తున్న గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తొందని మండిపడ్డారు. జిల్లాలో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయనుండగా  కేవలం 600 …

Read More »

ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్

సిరాజ్ సంచ‌ల‌న బౌలింగ్‌..  తెలంగాణఅక్షరం-స్పోర్ట్స్ డెస్క్ వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు భార‌త జ‌ట్టు అద్బుత విజ‌యం సాధించింది. ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంక‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదోసారి ఆసియా క‌ప్ చాంపియ‌న్‌గా నిలిచింది. ల‌క్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(27),  ఇషాన్ కిష‌న్(23) నాటౌట్‌గా నిలిచి జ‌ట్టును గెలిపించారు.

Read More »

ఐటీ మినిస్టర్ పర్యటన వేళ ఆంక్షలు..

శుక్రవారం ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ .వి.రంగనాథ్ తెలంగాణ అక్షరం-వరంగల్ క్రైం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్, హన్మకొండ, కాజీపేట పర్యటనలకు శుక్రవారం రానున్న సందర్భంగా ట్రై సిటి పరిధిలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్, గురువారం వెల్లడించారు. శుక్రవారం ఉదయం 09.00 నుండి రాత్రి 08.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..   ములుగు,భూపాలపల్లి వైపు నుండి వచ్చు …

Read More »