టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తెలంగాణ అక్షరం-జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఒక జర్నలిస్టు యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను మభ్యపెట్టి పక్కదారి పట్టించేందుకు ఆ యూనియన్ చేస్తున్న చర్యలను ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. యూనియన్ చేస్తున్న అనధికారిక కార్యకలాపాలకు మీడియా అకాడమి ఛైర్మన్ మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు. ఆదివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »Telangana
పేక’ఆట’లో ప్రముఖులు
నర్సంపేటలో కలకలం.. పేకాటాడుతూ పట్టుపడిన రాజకీయ నాయకులు.! సర్వాపురంలోని ఓ ఇంటిలో ఆడుతుండగా పలువురిని పట్టుకున్న పోలీసులు తెలంగాణఅక్షరం – నర్సంపేట నర్సంపేట పట్టణంలోని పలువురు ప్రముఖులు పేకాటాడుతూ ఆదివారం పట్టుబడ్డారు. పట్టణ ప్రముఖులు పేకాట ఆడి పట్టుబడ్డారన్న వార్త నర్సంపేట పట్టణంలో హల్చల్ చేస్తోంది. పట్టణంలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నర్సంపేట పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సంపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఉన్నారు. పట్టుబడిన వారిలో నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ …
Read More »మల్లారెడ్డిపల్లి క్రీడాకారులకు దుస్తుల అందజేత
తెలంగాణ అక్షరం-వీణవంక ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంటు నంది మేడారంలో జరుగుతున్న సందర్భంగా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి వాలీబాల్ క్రీడాకారులకు జగిత్యాల పోలీస్ ఆర్.ఐ రామకృష్ణ, కన్నా రమేష్, కోచ్ మోహన్ రావు ఉమ్మడి వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,పడాల అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు క్రీడా దుస్తులు శుక్రవారం అందజేశారు. క్రీడా దుస్తులు అందజేసినందుకు నాని క్రీడాకారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో క్రీడాకారులు, కర్రే నాని, హరీష్, రాము, ప్రశాంత్, అనిల్, …
Read More »చికిత్స పొందుతూ మహిళ మృతి
రెండో భర్త వేధింపులే కారణం..? మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తెలంగాణఅక్షరం-వీణవంక రెండో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని బేతిగల్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన ఇడుమాల వెంకటలక్ష్మి కూతురు తిరుపకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే వీరి కుటుంబం కొంత కాలం పాటు సజావుగా సాగింది. వీరికి …
Read More »దుర్గామాత శిబిరాలను సందర్శించిన కొమ్మిడి
తెలంగాణ అక్షరం వీణవంక వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి, చల్లూరు తదితర గ్రామాల్లో నెలకొల్పిన దుర్గామాత మండపాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన మేకల ఎల్లారెడ్డి, కొండాల్ రెడ్డి, కిరణ్, మధుసూదన్, గడ్డం కుమార్, కుమారస్వామి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ, సతీష్, అజయ్, నితీష్, సందీప్, లక్ష్మణ్, కొమురయ్య, రాకేష్ రెడ్డి యువ సైన్యం సభ్యులు పాల్గొన్నారు.
Read More »ఏకశిలలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ అక్షరం-హన్మకొండ కొత్తవాడ వరంగల్ లోని ఏకశిలా జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి పిల్లలు , ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా, అందంగా బతుకమ్మలు పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పండుగను చేసుకున్నారు. పిల్లలు భారత జాతి సంస్కృతిని, సంప్రదాయాన్ని చాటే విదంగా అందంగా దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పూజిస్తూ ఆనందంగా గడిపారు. ఈ సందర్బంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి గారు పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికి …
Read More »ఏకశిలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
తెలంగాణ అక్షరం-హన్మకొండ ఏకశిలా హై స్కూల్ పెంబర్తి ,హసన్పర్తి, హనుమకొండ నందు ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.విద్యార్థిని విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తంగేడు,బంతి, చామంతి, గునుగు, గోరంట తో సహా రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ( షీ టీమ్స్ ) కె సుజాత, అనురాగ్ …
Read More »వీణవంక తహసీల్దార్ గా గుర్రం శ్రీనివాస్
తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక తహసీల్దార్ గా గుర్రం శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్ లక్ష్మణ్ విజిలెన్స్ శాఖ కు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ గతంలో కలెక్టరేట్ లో పని చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై నేరుగా తనను సంప్రదించాలని మండల ప్రజలకు సూచించారు.
Read More »తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
2.2 లక్షల, బంగారం, వెండీ తస్కరణ పశ్చిమ బెంగాల్ లో నిందితుల అరెస్ట్.. తెలంగాణఅక్షరం-హైదరాబాద్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఉన్న భట్టి విక్రమార్క నివాసంలో.. దొంగలు పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి.. లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు. అయితే.. ఇంట్లో నగదు, బంగారు, వెండి …
Read More »ఆలయ ఫౌండేషన్ చేయూత
తెలంగాణఅక్షరం-వీణవంక కరీంనగర్ జిల్లా మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు కోల రాజయ్య ప్రమాదవశాత్తు తన కాలును కోల్పోయాడు. కాగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆలయ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ ను సంప్రదిచారు. దీంతో గుణ సాగర్ ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకుడు, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన భగవాన్ మహావీర్ ట్రస్ట్ సౌజన్యంతో రాజయ్యకు జైపూర్ కాలును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఐఏఎస్ నరహరితో పాటు గుణసాగర్ కు ధన్యవాదాలు …
Read More »