Telangana

జాతీయస్థాయి సైన్స్ సెమినార్ కు ఏకశిల విద్యార్థిని ఎంపిక

తెలంగాణ అక్షరం- హన్మకొండ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ) హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్- 2023లో పాల్గొన్న ఏకశిలా విద్యార్థిని పి. హన్సిక ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సంపాదించి జాతీయస్థాయికి ఎంపికైనట్లు ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్. మాధవి గైడ్ టీచరుగా వ్యవహరించిన “Millets-A Super Food or a Diet Fad”? ( సిరి ధాన్యాలు సంపూర్ణ ఆహరమా లేదా ఆహార వ్యమోహమా) …

Read More »

సొసైటీ సభ్యుల సక్షేమమే లక్ష్యం

టెస్కో రాష్ట్ర డైరెక్టర్ అడిగొప్పుల సత్యనారాయణ తెలంగాణఅక్షరం-వీణవంక చేనేత సహకారం సంఘం (సొసైటీ) సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టెస్కో రాష్ట్ర డైరెక్టర్, కోర్కల్ చేనేత సహకారం సంఘం సొసైటీ అధ్యక్ష పర్సన్ ఇన్చార్జి అడిగొప్పుల సత్యనారాయణ అన్నారు. కోర్కల్ చేనేత సహకారం సంఘం 51వ వార్షిక, 58వ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ సొసైటీ సభ్యులు, అధికారుల సహకారంతో సంఘం లాభాల్లో నడిపేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. సంఘం స్థాపించనప్పటి నుండి 51 సంవత్సరాలుగా …

Read More »

పంటలకు సస్య రక్షణ చర్యలు చేపట్టాలి

పంటలను పరిశీలించిన డీఏవో శ్రీధర్ తెలంగాణ అక్షరం-వీణవంక చీడ, పీడల నుండి పంటల రక్షణకు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద సూచనలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని వరి, పత్తి పంటలను ఆయన మంగళవారం స్థానిక ఏఈవో చందా రాకేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  పంటలకు వస్తున్న సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే నష్టాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా వరిలో వచ్చే మొగిపురుగు, అగ్గి తెగులు, జింకు …

Read More »

ఘనంగా వినాయక చవితి వేడుకలు

వాడవాడల వెలిసిన వినాయక విగ్రహాలు తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలో వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలను విక్రయించి గ్రామాల్లో డప్పు చప్పులతో ఊరేగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలల్లో ప్రతిష్టించారు. అనంతరం పూజారులతో పూజలు చేశారు. మండలంలో సుమారు 200 వరకు విగ్రహాలు ఏర్పాటు చేయగా మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, ఎల్బాకలో జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.  కాగా రెండో రోజైన మంగళవారం అన్ని మండపాల్లో …

Read More »

బిఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో మార్పులు..?

తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. అయితే ఈ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే అవకాశం కల్పించారు. దీంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితపై విపక్షాల నుంచి సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద పెద్ద …

Read More »

గణేషుడి ఆశీర్వాదంతో ప్రజలంతా బాగుండాలి

ఎమ్మెల్యే నన్నపనేని నివాసంలో ఘనంగా వినాయకచవితి వేడుకలు తెలంగాణ అక్షరం-వరంగల్ గణేషుని ఆశీర్వాదంతో ప్రజలంతా బాగుండాలని ఆ గణేషుడిని వేడుకున్నట్టు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు..ఈ రోజు వినాయక చవితి సందర్బంగా శివనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో కుటుంబసమేతంగా వినాయకున్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..తన సతీమణి వాణి,కుమారులు లోకేష్ పటేల్, మన్ ప్రీత్ పటేల్, కార్యాలయం సిబ్బంది నడుమ ఈ పూజలు నిర్వహించారు. సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వినాయకుని ఆశీర్వాదంతో రాష్ట్రం,నియోజకవర్గం అద్బుతంగా అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు..ఆ గణేషుని …

Read More »

వర్గీకరణ పేరుతో పబ్బం గడుపుతున్న ప్రభుత్వాలు

తెలంగాణఅక్షరం-వీణవంక వర్గీకరణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆ సంఘం నూతన కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధు అమలుతో పాటు నామినేటెడ్ పోస్టులల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షుడిగా రెడ్డిపల్లి సర్పంచ్ పోతుల నర్సయ్య, బొబ్బిలి ప్రేమానందం, సలహాదారుడిగా సమిళ్ల బాబురావు, మండల అధ్యక్షుడిగా కర్నె …

Read More »

ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్

సిరాజ్ సంచ‌ల‌న బౌలింగ్‌ తెలంగాణఅక్షరం-క్రీడలు వ‌ర‌ల్డ్ క‌ప్(వన్డే కప్ 2023) ముందు భార‌త జ‌ట్టు అద్బుత విజ‌యం సాధించింది. ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంక‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, 8 వసారిఆసియా క‌ప్ చాంపియ‌న్‌గా నిలిచింది. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(27), ఇషాన్ కిష‌న్(23) నాటౌట్‌గా నిలిచి  భారత జ‌ట్టును అలవోకగా గెలిపించారు    

Read More »

నెరవేరిన 20 ఏళ్ల కల

  జర్నలిస్ట్ కుటుంబాల్లో ఆనందోత్సవం ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ, పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు తెలంగాణఅక్షరం-హుజురాబాద్ గత 20 సంవత్సరాలుగా హుజురాబాద్ జర్నలిస్టుల కల కు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వాడి కౌశిక్ రెడ్డి రూపంలో కల నెరవేరింది. సంవత్సరాలుగా నివేషణ స్థలాల కోసం ఎన్నో ఎదురుచూపులకు నేనున్నానంటూ మీ కల నేను సహకారం చేస్తానంటూ అన్నమాటకు కట్టుబడి జర్నలిస్టులకు నివేషణ స్థలాల పట్టాలు అందించారు. శనివారం హుజరాబాద్ లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జర్నలిస్టులకు నివేషణ స్థలాల పట్టాలు …

Read More »