తెలంగాణ అక్షరం-వీణవంక తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు. చల్లూర్ లో ఆయన ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి వాహన చోదకులకు బ్రీతింగ్ ఎనలైజర్ చే పరీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాన్ని నడిపినట్లు అయితే చర్యలు ఉంటాయని చెప్పారు.
Read More »Telangana
అట్రాసిటీ కేసు నమోదు
తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని మామిడాల పల్లి గ్రామానికి చెందిన కనకం వెంకటస్వామిని చల్లూరు గ్రామానికి చెందిన నల్లవెల్లి తిరుపతి కులం పేరుతో దూషించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కనకం వెంకటస్వామి తన భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టుతుండగా తిరుపతి పనులు ఆపాలని కులం పేరుతో దూషించారు. కాగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Read More »అర్హులైన మహిళలకు రూ.2500..?
తెలంగాణఅక్షరం-హైదరాబాద్ మరో హామీ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయడంపై సీఎం రేవంత్ ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని సూచించినట్లు సమాచారం.
Read More »తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ అక్షరం-హైదరాబాద్ బ్యూరో రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమించింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలిగా పోస్టింగ్ ఇచ్చారు. అధికారుల కొత్త పోస్టింగ్: ఇరిగేషన్ కార్యదర్శి: రాహుల్ బొజ్జా స్విత సబర్వాల్: స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ దాసరి …
Read More »వీణవంక ఎస్ఐగా వంశీకృష్ణ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక ఎస్సైగా వంశీకృష్ణ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై ఆసిఫ్ మహమ్మద్ వి ఆర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ ను సంప్రదించవచ్చని సూచించారు. అనంతరం జమ్మికుంట రూరల్ సీఐ కోరే కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More »వీణవంక తహసీల్ కార్యాలయంలో దొంగతనం
కింది స్థాయి ఉద్యోగుల చేతివాటంతో ఒకరి డిజిటల్ సైన్ మరొకరి వినియోగం ఉన్నతాధికారులకు, పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు తెలంగాణఅక్షరం-వీణవంక ఆయనో మండల మెజిస్ర్టేట్.. మండలం మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఏ చిన్న విషయం నుండి మొదలు మండలం మొత్తం భూమి, సర్టిఫికెట్లు ఇతరత్రా పనులు ఆయనే చేయాల్సి ఉంటుంది. ఆయనకు వచ్చే ప్రతీ దరఖాస్తు స్వయంగా పరిశీలించిన తర్వాతే ఆయన డిజిటల్ సైన్ చేసి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన ప్రమేయం లేకుండా మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో డిజిటల్ …
Read More »వరంగల్ ప్రెస్ క్లబ్ లో న్యూఇయర్ వేడుకలు
తెలంగాణ అక్షరం-హనుమకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. క్లబ్ ఆవరణలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్‌లు మదన్ మోహన్, కొండల్ రావు, బీఆర్ లెనిన్, గడ్డం కేశవమూర్తి, మెండు …
Read More »బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నాగారపు శ్రీనివాస్
తెలంగాణ అక్షరం-కరీంనగర్ తెలంగాణ బిసి ఉద్యోగుల సంఘo రాష్ట్ర కార్యదర్శిగా నాగారపు శ్రీనివాస్ నియమితులయ్యారు. సోమవారం కరీంనగర్ తిరుమల నగర్ లో ఉమ్మడి జిల్లా బిసి ఉద్యోగుల సంఘ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీనివాస్ యాదవ్ హాజరై నాగారపు శ్రీనివాస్ ని రాష్ట్ర కార్యదర్శిగా నియామిస్తు నియామక పత్రాలు అందజేశారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించిన రాష్ట్ర ప్రధాన …
Read More »షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
కాలిపోయిన టీవీ, ల్యాప్ టాప్ తెలంగాణఅక్షరం-వీణవంక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు వ్యాపించి టీవీ, ల్యాప్ టాప్ దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ లక్ష్మయ్య-రాజమ్మ దంపతుల కుమారులు, కూతురు-అల్లుళ్లు క్రిస్మస్ సందర్భంగా గ్రామానికి వచ్చారు. కాగా పండగ సంబరాల్లో ఉండగా వారి యొక్క ఇంట్లో కాలక్షేపానికి టీవీ చూస్తుండగా ఒకేసారి షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో వారు భయంతో బయటకి పరుగులు తీశారు. …
Read More »వీణవంక బాలికకు గిన్నిస్ బుక్ లో చోటు
సహస్ర శ్రీకి పలువురి అభినందన తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రానికి చెందిన బత్తిని సహస్ర శ్రీకి గిన్నిస్ బుక్ లో చోటు లభించింది. సహస్ర శ్రీ తన మిత్ర బృందంతో కలిసి హైదరాబాద్ లోని గచ్చిబౌళి స్టేడియంలో భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించారు. ఈ కాగా ఈ పోటీల్లో 6000 మంది కళాకారులతో కలిసి సుమారు ఏడు నిముషాల పాటు సహస్ర శ్రీ నృత్యం చేసింది. ఈ పోటీలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క హాజరై …
Read More »