తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి పర్వాతాలు అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. కాగా ఆ గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పర్వతాలు మృతదేహం వద్ద నివాళులర్పించి, మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మీభూమయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు చింతల రాజయ్య, అంబాల మధునయ్య, ఒడ్డెపల్లి అరుణసమ్మయ్య, ఒడ్డెపల్లి రాజయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More »Telangana
ఇసుక లారీల దమ్ముతో రోగాలు వస్తున్నా పట్టించుకోరా..?
అధికారులపై వీణవంక ప్రజల ఆగ్రహం రూటు మ్యాప్ లేకున్నా లారీల రాకపోకలపై దుకాణాదారుల ఆందోళన తెలంగాణఅక్షరం-వీణవంక అది వీణవంక మండల కేంద్రం.. నిత్యం కరీంనగర్-వీణవంక-జమ్మికుంట ప్రధాన రహదారి.. కానీ రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడం, ఇదే రహదారిపై వందలాది ఇసుక లారీలు వెళ్లడం.. రోడ్డు గుంతలు పడడం.. దీని పర్యావసానం దుమ్ము లేవడం.. ఆ దుమ్ముతో వందలాది మందికి శ్వాసకోశ వ్యాధులు.. నెలల తరబడి దగ్గు, జలుబు జ్వరం, ఇబ్బందులు.. వీటిని భరించలేక మండల కేంద్రానికి చెందిన ప్రజలు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం …
Read More »సీఎం దృష్టికి జర్నలిస్టుల ప్రధాన సమస్యలు
సానుకూలంగా స్పందించిన రేవంత్ ముఖ్యమంత్రిని కలిసిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏ.రేవంత్ రెడ్డిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం సచివాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని …
Read More »రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు
తహసీల్దార్ తిరుమల్ రావు, ఎస్సై ఆసీఫ్ హెచ్చరిక వీణవంకలో 50 క్వింటాళ్ల బియ్యం పట్టివేత తెలంగాణఅక్షరం-వీణవంక రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తిరుమల్ రావు, ఎస్సై ఎండీ ఆసీప్ హెచ్చరించారు. మండల కేంద్రం నుండి వేరే ప్రాంతానికి తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజల నుండి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఇతరులకు ఎక్కువ ధరకు విక్రియిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు …
Read More »అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
జమునాస్టిక్ లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థికి 5వేలు అందజేసిన వంశీ రెడ్డి హైదరాబాద్ : తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది . తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.టి టి ఏ వ్యవస్థాపకుడు పైళ్ల మల్లా రెడ్డి, సలహా కాన్సుల్ చైర్ విజయపాల్ రెడ్డి, సహాధ్యక్షులు మోహన్ పట్లోల్ల, సభ్యుడు భరత్ మదాడి ఆధ్వర్యంలో 2015 లో మొదలై …
Read More »ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’
నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ డబ్బుకి ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా.. శవంతో సమానం పోస్టర్ల ఆవిష్కరణ తెలంగాణ అక్షరం- హన్మకొండ ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే – మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిన ఇలాంటి వికృత వ్యవస్థ కోసమా గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ వంటి మహనీయులు జీవితాలు అర్పించింది అని ఆయన ప్రశ్నించారు. ధనిక …
Read More »బడుగు బలహీనవర్గాల నాయకుడికే తమ మద్దతు
ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహసాగర్ తెలంగాణఅక్షరం-వీణవంక బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఈటల రాజేందర్ కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు జాతీయ ఎంబీసీ మరియు డీఎన్టీల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బంగారు నర్సింహసాగర్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఎంబీసీలకు ఏబీసీడీ వర్గీకరణకు బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నదని, అందులో భాగంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామని అన్నారు. కావున ఎంబీసీలకు …
Read More »బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం
హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున తెలంగాణఅక్షరం-వీణవంక బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్ నగర్, శ్రీరాములపేట, కోర్కల్, కిష్టంపేట, దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో జమున గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికెళ్లినా హుజురాబాద్ గుర్తుండేలా ఈటల రాజేందర్ చేశారని గుర్తు చేశారు. ఉద్యమ కాలం నుండి పార్టీని అంటుపెట్టుకుని తెలంగాణ …
Read More »కొంగు చాచి అడుగుతున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి
పదిహేనేండ్లుగా మీతోనే ఉన్నాం.. పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక పదిహేనేండ్లుగా మీతోనే ఉన్నాం.. మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నాం.. కొంగుచాచి అడుగుతున్నాం.. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీతోపాటే మీ కుటుంబ సభ్యుల్లా ఉంటామని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ప్రార్థించారు. ఆమె మండలంలోని రెడ్డిపల్లి, ఘన్ముక్లతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు నుదుట బొట్టుపెట్టి పెట్టి …
Read More »ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఆయన మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతీ పథకం ప్రతీ ఇంటికి చేరిందని, ఆ ప్రభుత్వ పథకాలతో ఘనవిజయం …
Read More »