Telangana

9న పశు సంవర్దక శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి

తెలంగాణ అక్షరం-వీణవంక గొర్రెలు, మేకల పంపకందారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 9న తెలంగాణ పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి రవియాదవ్ తెలిపారు. మండలంలోని చల్లూరు గ్రామంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం సబ్సిడితో అందిస్తున్న గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తొందని మండిపడ్డారు. జిల్లాలో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయనుండగా  కేవలం 600 …

Read More »

ఎనిమిదోసారి ఆసియా క‌ప్‌ను ముద్దాడిన భార‌త్

సిరాజ్ సంచ‌ల‌న బౌలింగ్‌..  తెలంగాణఅక్షరం-స్పోర్ట్స్ డెస్క్ వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు భార‌త జ‌ట్టు అద్బుత విజ‌యం సాధించింది. ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంక‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదోసారి ఆసియా క‌ప్ చాంపియ‌న్‌గా నిలిచింది. ల‌క్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(27),  ఇషాన్ కిష‌న్(23) నాటౌట్‌గా నిలిచి జ‌ట్టును గెలిపించారు.

Read More »

ఐటీ మినిస్టర్ పర్యటన వేళ ఆంక్షలు..

శుక్రవారం ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ .వి.రంగనాథ్ తెలంగాణ అక్షరం-వరంగల్ క్రైం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్, హన్మకొండ, కాజీపేట పర్యటనలకు శుక్రవారం రానున్న సందర్భంగా ట్రై సిటి పరిధిలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్, గురువారం వెల్లడించారు. శుక్రవారం ఉదయం 09.00 నుండి రాత్రి 08.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..   ములుగు,భూపాలపల్లి వైపు నుండి వచ్చు …

Read More »

శ్రీ రాములపేట గౌడ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్

తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని శ్రీ రాములపేట గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడిగా మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఆ సంఘం నాయకులు గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన నాయకులు, కులస్తులకు ధన్యవాదాలు తెలిపారు.  

Read More »

ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు రావడం సంతోషం

పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన రైతు బిడ్డలైన అన్నా చెల్లెల్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషకరమని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరూ ముందుకెళ్లాలని ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు.  మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల చంద్రయ్య-ఇందిర కుమారుడు శ్రావణ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్, వారి కుమార్తె నవత రాష్ట్ర ప్రభుత్వమైన ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. కాగా వారికి రెడ్డిపల్లి …

Read More »

అఖిలభారత యాదవ్ మహాసభ మండల అధ్యక్షుడిగా మర్రి స్వామి

తెలంగాణ అక్షరం-వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన  మర్రి స్వామి యాదవ్ ను అఖిలభారత యాదవ్ మహాసభ  మండల అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారపు సత్యనారాయణ  యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన రవి యాదవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆ ఉత్తర్వులను మండల కేంద్రంలోని బీరన్న ఆలయం ఆవరణలో మర్రి స్వామి యాదవ్ కు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అందజేశారు. ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ.. యాదవుల అభివృద్ధికి …

Read More »

7న కరీంనగర్ లో శ్రీ కృష్ణ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన

యాదవ్ లు  అధిక సంఖ్యలో తరలిరావాలి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి రవియాదవ్ తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ లో ఈ నెల 7న నూతనంగా నిర్మించే శ్రీ కృష్ణ దేవాలయం శంకుస్థాపనకు యాదవులు అధిక సంఖ్యలో తరలిరావాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన రవియాదవ్ యాదవ్ లను కోరారు. మండల కేంద్రంలోని బీరన్న ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించి, …

Read More »

మహిళా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

బతుకమ్మ చీరల పంపిణీలో వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వం పని చేస్తోందని వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పోతుల నర్సయ్య అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు చీరలను అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుట్టిన పిల్ల కాడి నుండి పండు ముసలమ్మ వరకు …

Read More »

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం

వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి రెడ్డిపల్లిలో సుమారు రూ.50లక్షల పనుల ప్రారంభం తెలంగాణ తెలంగాణ-వీణవంక గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సుమారు రూ.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలు శుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల …

Read More »

హుజరాబాద్ లో మినీ కలెక్టరేట్ కడుతం..

సీఎం కాళ్లు మొక్కైనా వెయ్యి కోట్లు తెస్త.. స్పోర్ట్స్ కిట్స్, చీరల పంపిణీ రూ.పది కోట్లతో మినీ స్టేడియం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లాంటి గెస్ట్ హౌస్ నిర్మిస్తా  ప్రభుత్వ విప్ , ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక/కమలాపూర్ కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా వెయ్యి కోట్లు రూపాయల నిధులను తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించండి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని …

Read More »