Telangana

ఓటరు జాబితాలో మీ పేరు చూసుకోవాలి

కమలాపూర్ తహసీల్దార్ పాలకుర్తి మాధవి తెలంగాణఅక్షరం-వీణవంక ఓటర్లందరూ ఓటర్ జాబితాలో తమ తమ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకోవాలని కమలాపూర్ తహసీల్దార్ పాలకుర్తి మాధవి ఓటర్లను కోరారు.  ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబితా తుది జాబితాను ముద్రించడం జరిగిందని, ఆయా గ్రామాల్లో బిఎల్ఓ ల వద్ద ఓటర్ జాబితాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతీ ఓటర్ తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అయ్యాయో లేదో చూసు కావాల్సిందిగా సూచించారు.

Read More »

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో కాంస్య పథకం విజేత మౌటం సంగీత

తెలంగాణఅక్షరం-వీణవంక ఈనెల 1న కరీంనగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో హామర్ త్రో విభాగం లో కమలాపూర్ బాలికల పాఠశాలకు చెందిన మౌటం సంగీత పదవ తరగతి విద్యార్థిని మూడవ స్థానం సాధించి కాంస్య పథకం విజేతగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇంచార్జ్ మండల విద్యాధికారి రామకృష్ణరాజు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో కాంస్య పథకం సాధించిన విద్యార్థినీతో పాటు వ్యాయామ ఉపాధ్యాయుడు బండి కృష్ణమూర్తిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ తిరుపతిరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ …

Read More »

ముస్లిం న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలిగా ఎండీ పహీమా సుల్తానా

తెలంగాణఅక్షరం, హన్మకొండ : ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పాహీమా సుల్తానా ను సామాజిక మహిళా న్యాయ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి కూరాకుల ములుగు జిల్లా ముస్లిం మహిళా న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలు పాహీమా సుల్తానా ను గా నియమించారు. మహిళలు దేశ జనాభా లో 50%పైగా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రకులాలు మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది అణగారిన వర్గాలకు గుర్తింపు పొందాలాంటే వారి నాయకత్వం అవసరమని భావించి ప్రజా సంఘాలలో పని చేస్తున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పహిమా సుల్తానా …

Read More »

చల్లూరులో బోనమెత్తిన పద్మశాలీలు

పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని పద్మశాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పద్మశాలీలు బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలీ కులానికి చెందిన మహిళలు, యువతులు బొనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులోని పోచమ్మ ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు గంజి కుమారస్వామి, వార్డు సభ్యులు గంజి రాజు, గంజి రాజమణి-శ్రీనివాస్,మహేందర్, శంకర్, హేమంత్, బాబు, …

Read More »

ఏకశిల అధినేత గౌరు తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకలు

  తెలంగాణ అక్షరం- వీణవంక ఏకశిలా విద్యా సంస్థల అధినేత జన్మదిన వేడుకలు ఏకశిలా విద్యా సంస్థల అధినేత డా, గౌరు తిరుపతి రెడ్డి జన్మదినo సందర్భంగా ఏకశిలా జూనియర్ కళాశాలల ఆధ్వర్యం లో స్వయం కృషి వృద్ధాశ్రమం లో పండ్లు, పాలు, గుడ్లు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ ముచ్చ.జితేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ సుధాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి మరియు ఆశ్రమ నిర్వాహకురాలు శుభా, సిబ్బంది,తది తరులు పాల్గొన్నారు.

Read More »

గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్సీ ప్రభుత్వ  విప్ పాడి కౌశిక్ రెడ్డి ఇల్లందకుంటలో నూతన గ్రామపంచాయతీ ప్రారంభం తెలంగాణఅక్షరం-ఇల్లందకుంట ఇల్లందకుంట మండల కేంద్రంలోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని 20 లక్షలు నిధులతో కూడిన భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు, అలాగే బీరన్న గుడి కమిటీ హాల్ 15 లక్షలు నిర్మాణం కోసం కురుమ సంఘ కులస్తులతో …

Read More »

కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

  తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండలంలోని చల్లూరు, మామిడాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులుు పెద్ది సంపత్ రెడ్డి, గుండేటి మహేష్, కాటిపల్లి అజయ్, తిరుమలేష్, తోకల సంపత్ రెడ్డి, మిర్చి సమ్మయ్య, ఎలవేణ సదయ్య, ఎడ్ల రాజిరెడ్డి, రమేష్, ఇజాజ్, దిలీప్, అనిల్, …

Read More »

రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

  తెలంగాణ అక్షరం,వీణవంక   గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కోతిరెడ్డిపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జన స్వామి అనే గీత కార్మికుడు వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కి ఇంటికి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం అతనిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని జమ్మికుంట లోని ఆసుపత్రికి తరలించారు.

Read More »

హుజురాబాద్ లో మరో 4 మండలాలు

కమలాపూర్ టౌన్ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం-హుజురాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రస్తుతం ఉన్న ఐదు మండలాలతో పాటు మరో నాలుగు మండలాలు, కమలాపూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు  రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నియోజకవర్గ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాడి కౌశిక్ రెడ్డి మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా …

Read More »

కన్నుల పండువగా గోవింద కళ్యాణం 

పాల్గొన్న ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని దేశాయిపల్లిలో ఎంపీపీ ముసిపట్ల రేణుక – తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గోవిందా కళ్యాణ మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. దేశాయిపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో ఆశేష భక్తజనం మధ్య, వేదపండితుల మంత్రోచ్చరణలతో గోవింద కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. తీరొక్క పూలు, పండ్లు, నైవేద్యాలు, స్వామి వారికి సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ : ప్రజలు, గొడ్డుగోద, పాడిపంటలు సుభిక్షంగా …

Read More »