Telangana

ట్రై సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..

రేపు గణేశ్ నిమజ్జన మహోత్సవం వివరాలు వెల్లడించిన సీపీ ఏవీ రంగనాథ్ తెలంగాణ అక్షరం, హన్మకొండ క్రైమ్ వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని బుధవారం (రేపు) గ్రేటర్ వరంగల్ పరిధిలో శోభాయాత్ర నిర్వహించబడుతుందని, దీంతో వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ట్రైసిటీ పరిధిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ మంగళవారం వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా …

Read More »

వినాయక మండపాలకు చందా పంపిణీ

వీణవంక మండలంలో పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి సుడిగాలి పర్యటన తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, బొంతుపల్లి, ఎల్బాక, గంగారం, చల్లూరుతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్  రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. అన్ని గ్రామాల్లో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ మండపాల కమిటీలకు రూ.5వేల చందా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో …

Read More »

వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు

తెలంగాణఅక్షరం-వీణవంక   మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.

Read More »

ఈవీఎంలపై అవగాహన పెంచుకోవాలి

తెలంగాణ అక్షరం-వీణవంక ఈవీఎంలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రెడ్డిపల్లి క్లస్టర్ ఏఈవో చందా రాకేష్ పటేల్ సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి, కోర్కల్, దేశాయిపల్లి గ్రామాల్లో సోమవారం ఈవీఎంలపై ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం మిషన్ మనం ఓటు వేసే క్రమంలో సక్రమంగా ఓటు పడిందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుందని చెప్పారు. ఆ ఓటు వీవీ ప్యాడ్ ల ద్వారా మనం వేసిన ఓటు పడిందో లేదో తప్పకుండా చూసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ …

Read More »

వీణవంక మండల సాంస్కృతిక సంస్థల కళాకారుల ఎన్నిక

  తెలంగాణఅక్షరం-వీణవంక సంస్కృతిక సంస్థల కళాకారుల మండల కమిటీని ఆ సంఘం హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు తాండ్ర శంకర్ అధ్యక్షతన ఆదివారం ఎన్నకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న కళా వైభోగాలను చక్కగా ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్య వంతం చేయడంలో ఆనాటి కళాకారులు ముందడుగు ఉండేవారని అన్నారు. ప్రస్తుతం కళాకారులకు ప్రోత్సాహం లేక కళలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్ చేశారు. అంతేకాకుండా ప్రోత్సాహం లేకుండా ఉండడంతో వారి మనుగడ కరువవుతుందని వాపోయారు. ప్రస్తుతం కళలను ప్రోత్సహించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని, ప్రభుత్వం …

Read More »

ఆర్ఎంపీ వైద్యుడిపై కేసు

తెలంగాణఅక్షరం-వీణవంక ఓ యువతిని వేధింపులకు గురిచేసిన మండల కేంద్రానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన అన్వర్ పాషా అనే ఆర్ఎంపీ క్లీనిక్ ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తున్నాడు. కాగా గత సంవత్సరం క్రితం శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవివాహిత యువతి అతడి వద్ద కొంత కాలం పాటు పని చేసి మానేసింది. అయితే ఇటీవల మళ్లీ తన వద్ద పని చేయాలని …

Read More »

బిగ్ బ్రేకింగ్ :   గ్రూప్ -1 పరీక్షలు రద్దు

    తెలంగాణ అక్షరం-హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను హై కోర్టు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. ఇక, గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా …

Read More »

రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నాం

డీ గ్రేడ్ లో ఉన్న సొసైటీని ఏ గ్రేడ్ లోకి తీసుకొచ్చాం పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక డీ గ్రేడ్ లో ఉన్న వీణవంక సొసైటీని తమ పాలకవర్గంలో ఏ గ్రేడ్ లోకి తీసుకొచ్చామని, రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, పాలకవర్గం సహాయ సహకారాలతో సొసైటీని లాభాల్లో నడిపిస్తున్నట్లు తెలిపారు. రైతులు …

Read More »

రాజమల్లు సేవలు మరువలేనివి

పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి తెలంగాణఅక్షరం-వీణవంక పీఏసీఎస్ లో సిబ్బందిగా పనిచేసిన రాజమల్లు సేవలు మరువలేనివని పీఏసీఎస్ చైర్మన్ మావరుపు విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. సొసైటీలో పనిచేస్తున్న మ్యాకల రాజమల్లు ఇటీవల రిటైర్డ్ అయ్యారు. కాగా ఆయనకు శుక్రవారం సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ పాలకవర్గం, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు రాజమల్లు-యాదమ్మ దంపతులను పూలమాలతో సన్మానించి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాజమల్లు సుధీర్ఘంగా పనిచేసిన అనుభవంతో సొసైటీలో …

Read More »

ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం

ఎప్పుడు ప్రకటించనున్నారంటే.. _ డిసెంబరు తొలివారంలో పోలింగ్‌ _వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం పర్యటన _వీరి నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం _ఓటర్ల జాబితాపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తి _అక్టోబరు 4న తుది జాబితా విడుదల  తెలంగాణ అక్షరం-హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు అక్టోబరు 6న షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. దాంతో.. ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే.. 2018లో.. డిసెంబరు …

Read More »