Telangana

ఆకట్టుకున్న ఉమ్మడి జిల్లా చదరంగం పోటీలు

విజేతలకు బహుమతులు అందజేత తెలంగాణఅక్షరం-కరీంనగర్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ జీనియస్ చెస్ అకాడమీ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ మరియు అండర్ 15 విభాగంలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి మాట్లాడుతూ చదరంగంతో మేధాశక్తి ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య మాట్లాడుతూ …

Read More »

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్లాట్ బుకింగ్‌ విధానం ప్రారంభం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ బీ ప్రవీణ్‌కుమార్‌ పెద్దపల్లి, మే12: పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఆస్తులు/ప్లాట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోనుటకు స్లాట్‌ బుకింగ్‌ విధానం ప్రవేశ పెట్టినట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ బీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ విధానం, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని ఆస్తులు/ ప్లాట్స్​‍ను ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయటకు రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ చర్యలు చేపట్టనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 …

Read More »

ఎప్‌సెట్‌ -2025లో శ్రీ చైతన్య ఉత్తమ ప్రతిభ

తెలంగాణ అక్షరం-కరీంనగర్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభచూపినట్లు విద్యాసంస్థల చైర్మన్‌ ముద్దసాని రమేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను ఆయన అభినందించారు. గోకులకొండ వైష్ణవి 810 ర్యాంకు, బీ మనోఘ్న 968, బీ సాత్విక్‌ 1142, పీ స్ఫూర్తిశ్రీ 1527, బీ శ్రావణి 1803, పీ బ్లెసీ సుసన్‌ 2106, పీ చందన 2165, పీ భరత్‌ రెడ్డి 2815, పీ అజితేష్‌ 3016, కే అనూహ్య 3503, …

Read More »

ఎప్‌సెట్‌ -2025లో ట్రినిటీ విద్యార్థుల విజయభేరి

తెలంగాణ అక్షరం-కరీంనగర్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్‌ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950 ర్యాంకులతో పాటు మొత్తం 89 మందికి పైగా విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. ట్రినిటీ …

Read More »

ఎప్‌సెట్‌ -2025లో అల్ఫోర్స్‌ ప్రభంజనం

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అభినందించిన చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి తెలంగాణ అక్షరం-కరీంనగర్‌ ఎప్‌సెట్‌ -2025 ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల టైనిటాట్స్‌ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన బీ వర్షిత్‌ 203, అదిబా ఫిర్థోజ్‌ 206, ఎం ప్రణీత్‌ 250, కే మనోజ్‌కుమార్‌ 286, బీ శ్రీనిత్య 296, జీ కౌషల్‌ ప్రియ 339, …

Read More »

ఎన్టీఆర్‌ వీరాభిమాని ఆవునూరి జయరాజ్‌ మృతి

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) వీరాభిమాని ఆవునూరి జయరాజ్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్‌ కు ఆవునూరి జయరాజ్‌ వీరాభిమానిగా ఉండేవాడు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందునుండే జయరాజ్‌ అభిమానం పెంచుకున్నాడు. కాగా తెలుగుదేశం పార్టీ స్థాపించగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చల్లూరు నుండి గోదావరిఖనికి వలస వెళ్లిన జయరాజ్‌ ఆక్కడ పార్టీ బలోపేతం కోసం తీవ్రమైన కృషి చేశాడు. కాగా …

Read More »

జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత

కరీంనగర్‌ జిల్లాలో నాలుగు కుటుంబాలకు లబ్ధి కృతజ్ఞతలు తెలిపిన కరీంనగర్‌ ఐజేయూ జిల్లా శాఖ తెలంగాణఅక్షరం-కరీంనగర్ విధి నిర్వహణలో మరణించిన, అనారోగ్యాల గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబా‌ద్లో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం చెక్కుల పంపిణీ చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన చనిపోయిన జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదు సంవత్సరాల పాటు …

Read More »

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ర్ట సగర సంఘం

తెలంగాణఅక్షరం-హైదరాబాద్‌ రాష్ర్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ర్ట సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గారితో కలిసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి చాంబర్ లో గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా కమిటీ తెలంగాణ అక్షరం-వీణవంక మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆయిందాల అంజన్న డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా,ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా అమాయకపు గిరిజనులను చంపుతున్నారని ఆరోపించారు.మావోయిస్టులతో …

Read More »

మహిళలు పట్టుదలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

అవకాశాలను అందిపుచ్చుకోవాలి అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి గ్రామాల్లో సమస్యల పరిష్కరానికి ప్రత్యేక కృషి లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ హాల్ లో గ్రామీణ మహిళ నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం హాజరైన ప్రముఖ సినీ నటి రెజీనా కసాండ్రా పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు తెలంగాణఅక్షరం-కరీంనగర్‌ సహనానికి.. ఓర్పుకు మహిళలు మారుపేరూ అని, క్రమశిక్షణ పట్టుదల కృషి కటోర శ్రమతో నాయకత్వ లక్షణాలను …

Read More »