2914 మంది విద్యార్థుల హాజరు.. 61 మంది విద్యార్థులు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నీట్ పరీక్ష కేంద్రాల సందర్శన తెలంగాణఅక్షరం-కరీంనగర్ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం గా నిర్వహించామని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ బైపాస్ రోడ్ లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో నీటి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆయా చోట్ల ఎంత మంది …
Read More »Telangana
సగర భగీరథ మహర్షీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ అక్షరం-వీణవంక మే4న సగరుల కుల గురువైన భగీరథ మహర్షీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా సగరులు ఉన్న అన్ని గ్రామాల్లో భగీరథుడి జయంతి వేడుకలను ఉత్సవంలా నిర్వహించాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం భగీరథ మహర్షీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకునేందుకు రూ.6లక్షలు విడుదల …
Read More »పదో తరగతి ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల హావా..
తెలంగాణఅక్షరం-హన్మకొండ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యాసంస్థల హావా కొనసాగింది. 600 మార్కులకు గాను వి కృతిక 582 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే డీ సహస్ర్త 578మార్కులతో ద్వితీయ, జీ సాకేత్ కుమార్ 575 మార్కులతో తృతి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రకటించడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఉందని ప్రశంసించారు. ఫలితాలతో పాటు విద్య …
Read More »ఉగ్రవాదుల చర్యకు నిరసన కొవ్వొత్తుల ర్యాలీ
శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో నిరసనతెలంగాణ అక్షరం – బాలాపూర్ (టి లక్ష్మణ్):అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసిన ఉగ్ర వాదుల చర్యకు నిరసనగా బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్ పేటలో శనివారం శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. నల్లని దుస్తులు ధరించి కొవ్వొత్తులు చేతిలో పట్టుకుని ఉగ్రవాదుల దుశ్చర్య ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ …
Read More »రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని మానేరు వాగునుండి అక్రమంగా తరలిస్తున్నరెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. మల్లన్నపల్లి గ్రామంలో శనివారం ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా SRSP కెనాల్ వద్ద రెండు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా పోలీసులు ఆపి వాటిని పరిశీలించారు. వారి వద్ద సరైన పత్రాలు లేకుండా కోర్కల్ మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలించి హుజురాబాద్‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో మండలంలోని కోర్కల్ చెందిన రెండు ట్రాక్టర్లకు సంబంధించిన ఓనరు కం డ్రైవర్లైన కోర్కల్ కు …
Read More »రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
27న గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలి బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు వీణవంక :ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండులా తరలిరావాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాల కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని వీణవంక వాగు, మానేరు …
Read More »ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసి ప్రజలు ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులపై కేంద్రం త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ సాగర్ పేర్కొన్నారు. 25 మందికి పైగా బలిగొన్న ఉగ్రవాదానికి భారతదేశం ఉక్కు పాదం రుచి చూపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోని బైనారస్ లోయను సందర్శించడానికి వచ్చిన పర్యాటకుల పై హిందువులనే లక్ష్యంగా పెట్టుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 …
Read More »ఇంటర్మీడియట్ ఫలితాలలో ఏకశిలా విద్యార్థుల విజయకేతనం
తెలంగాణ అక్షరం-హన్మకొండఇంటర్మీడియట్ ఫలితాలలో ఏకశిలా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డా. గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నిరంతర యాజమాన్య పర్యవేక్షనతో , పటిష్టమైన ప్రణాళిక , సమిష్టి కృషి , సహజ నైపుణ్యాన్నీ వెలికితీసే ప్రేరణ తరగతులు , ఒత్తిడి లేని విద్య కోసం ప్రముఖ వ్యక్తులతో అవగాహనా సదస్సులతో పాటు, అత్యుత్తమమైన బోధనతో, క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం తో ఇంటర్ ఫలితాలలో అన్ని …
Read More »కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలి
సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర తెలంగాణ అక్షరం-హన్మకొండ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ పట్టణంలోని కేయూ ఎదురుగా ఉన్న ఎన్‌ఎస్ బంకెట్ హాలులో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగాయి. ఈ సమావేశాలు హన్మకొండ జిల్లా సగర సంఘం, హన్మకొండ సగర సంక్షేమ సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు …
Read More »వరంగల్ లో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
తెలంగాణఅక్షరం-వరంగల్ వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశకు చెందిన రంజాన్ కూలీ పనుల కోసం గిర్మాజీ పేటకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పక్కనే ఉన్న మూడేళ్ల బాలికపై అతడి కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై లైంగిదాడికి యత్నించారు. యువకుడు చేస్తున్న …
Read More »