తెలంగాణ అక్షరం-హన్మకొండ ఏకశిలా హై స్కూల్ పెంబర్తి ,హసన్పర్తి, హనుమకొండ నందు ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.విద్యార్థిని విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తంగేడు,బంతి, చామంతి, గునుగు, గోరంట తో సహా రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ( షీ టీమ్స్ ) కె సుజాత, అనురాగ్ …
Read More »Monthly Archives: September 2024
వీణవంక తహసీల్దార్ గా గుర్రం శ్రీనివాస్
తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక తహసీల్దార్ గా గుర్రం శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్ లక్ష్మణ్ విజిలెన్స్ శాఖ కు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ గతంలో కలెక్టరేట్ లో పని చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై నేరుగా తనను సంప్రదించాలని మండల ప్రజలకు సూచించారు.
Read More »తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
2.2 లక్షల, బంగారం, వెండీ తస్కరణ పశ్చిమ బెంగాల్ లో నిందితుల అరెస్ట్.. తెలంగాణఅక్షరం-హైదరాబాద్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఉన్న భట్టి విక్రమార్క నివాసంలో.. దొంగలు పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి.. లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు. అయితే.. ఇంట్లో నగదు, బంగారు, వెండి …
Read More »ఆలయ ఫౌండేషన్ చేయూత
తెలంగాణఅక్షరం-వీణవంక కరీంనగర్ జిల్లా మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు కోల రాజయ్య ప్రమాదవశాత్తు తన కాలును కోల్పోయాడు. కాగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆలయ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ ను సంప్రదిచారు. దీంతో గుణ సాగర్ ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకుడు, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన భగవాన్ మహావీర్ ట్రస్ట్ సౌజన్యంతో రాజయ్యకు జైపూర్ కాలును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఐఏఎస్ నరహరితో పాటు గుణసాగర్ కు ధన్యవాదాలు …
Read More »మర్రి స్వామియాదవ్ కు పలువురి పరామర్శ
తెలంగాణఅక్షరం-వీణవంక కోర్కల్ మాజీ సర్పంచ్ మర్రి స్వామి యాదవ్ కు మాతృవియోగం కాగా ఆయనను బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు నాగరపు సత్యనారాయణ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మంచాల రవీందర్, మల్లేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నేబోయిన రవి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గెల్లు మల్లయ్య యాదవ్, హుజురాబాద్ మండల అధ్యక్షులు బద్దుల …
Read More »విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించాలి
తెలంగాణ అక్షరం-హసన్ పర్తి జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హాసన్ పర్తి ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ మీటింగ్ కి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ మరియు క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు అందరికీ కూడా తగు సూచనలు చేశారు. స్కూల్లో పిల్లల సంఖ్యను పెంచి అదేవిధంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాలను విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చేయాలని సూచించారు ,అదేవిధంగా న్యాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే, మాక్ టెస్ట్ కూడా …
Read More »ఎమ్మెల్సీ బరిలో ‘మానేరు’ అధినేత కడారి
ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం
సందడి చేసిన కీర్తి సురేష్ నాగోల్ తో పాటు కర్నాటకలోనూ త్వరలో ప్రారంభం తెలంగాణ అక్షరం- హైదరాబాద్ హైదరాబాదు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను సినీ నటి కీర్తి సురేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో అతిపెద్ద షాపింగ్ షాపింగ్ మాల్ గా అవతరించిందనీ ఈ స్టోర్ ను నేను ప్రారంభించడం ఆనందంగా ఉందని, పట్టు ఫ్యాన్సీ …
Read More »తుమ్మేటి కుటుంబానికి కొమ్మిడి పరామర్శ
తెలంగాణఅక్షరం-వీణవంక జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు నల్ల కొండాల్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ తిరుమల్, సమ్మిరెడ్డి, సతీష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
Read More »శునకం.. విశ్వాసం..
యజమాని తుమ్మేటి మృతితో కుక్క కన్నీటి పర్యంతం సమ్మిరెడ్డి చిత్రపటం వద్ద బోరున విలపిస్తున్న శునకం తెలంగాణ అక్షరం-జమ్మికుంట విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తుంది శునకం. తనకు అన్నం పెట్టి సాకిన యజమాని అంటే అమితమైన అభిమానం చూపిస్తుంది. ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అండగా ఉంటుంది. అలాంటి స్వామి భక్తికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన. తన యజమాని కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మేటి తమ్మి రెడ్డి ఇటీవల కాలం చేయడంతో నిద్రాహారాలు మరిచి …
Read More »