వీణవంక ఎంపీడీవో శ్రీధర్ తెలంగాణ అక్షరం-వీణవంక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీణవంక ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. మండలంలోని వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య గల నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు భారీ వర్షాలకు తెగిపోవడంతో ఆయన సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించారు. రోడ్డుపై నిత్యం నడిచే వాహనాలకు అంతరాయం కలగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. ఎంపీడీవో వెంట ఏపిఓ శ్రీధర్ …
Read More »Daily Archives: 1 September 2024
బ్రేకింగ్ న్యూస్.. అలర్ట్.. అలర్ట్
వీణవంక జమ్మికుంట రాకపోకలకు అంతరాయం నర్సింగాపూర్-వీణవంక గ్రామాల మధ్య తెగిన రోడ్డు తెలంగాణ అక్షరం-వీణవంక కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారిపై వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య గల సబ్ స్టేషన్ సమీపంలో గల 20 మోరీల వద్ద గల రోడ్డు గత రెండు రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు తెగిపోయింది. కావున ప్రజలు గమనించి రహదారి వెంట రాకపోకలు నిలిచిపోయినందున ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
Read More »రేపు విద్యాసంస్థలకు సెలవు..
స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్.. భారీవర్షాల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తెలంగాణ అక్షరం, స్టేట్ బ్యూరో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పలు చోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. తెలంగాణలో …
Read More »అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హుజురాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక, హుజురాబాద్ విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందేనని, హుజురాబాద్ నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాదులోని తన నివాసం నుంచి ఫోన్ సంభాషణలో ఆర్డీవోకి సమాచారం అందించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తునైనా ఎదుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్మికుంటలోని …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
* తక్షణ సహాయ చర్యలు చేపట్టండి * సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అక్షరం-హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు …
Read More »