Daily Archives: 2 September 2024

మల్లారెడ్డిపల్లిలో కూలిన ఇల్లు

అప్రమత్తమైన బాధితులు 5తప్పిన ప్రమాదం తెలంగాణ అక్షరం వీణవంక గత మూడు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిమ్మల రాజయ్య ఇల్లు ఆదివారం రాత్రి కూలి నీలమట్టమయింది. ఈ సమయంలో నిద్రిస్తున్న రాజయ్య దంపతులు అప్రమత్తమై వెళ్లారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ సందర్భంగా భావిస్తూ కుటుంబం మాట్లాడుతూ నిరుపేద కుటుంబం రోడ్డున పడ్డామని రోధించారు. ప్రభుత్వం స్పందించి తమను  ఆదుకోవాలని కోరారు.

Read More »

కరీంనగర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలంగాణ అక్షరం-కరీంనగర్ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నెంబర్.+91 878 299 7247 తో బాటు వాట్సాప్ నెంబర్ ను +91 81251 84683ను సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్ లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ లో వెల్లడించారు.

Read More »