తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక తహసీల్దార్ గా గుర్రం శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన తహసీల్దార్ లక్ష్మణ్ విజిలెన్స్ శాఖ కు బదిలీ అయ్యారు. శ్రీనివాస్ గతంలో కలెక్టరేట్ లో పని చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై నేరుగా తనను సంప్రదించాలని మండల ప్రజలకు సూచించారు.
Read More »Daily Archives: 27 September 2024
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ
2.2 లక్షల, బంగారం, వెండీ తస్కరణ పశ్చిమ బెంగాల్ లో నిందితుల అరెస్ట్.. తెలంగాణఅక్షరం-హైదరాబాద్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఉన్న భట్టి విక్రమార్క నివాసంలో.. దొంగలు పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి.. లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు. అయితే.. ఇంట్లో నగదు, బంగారు, వెండి …
Read More »ఆలయ ఫౌండేషన్ చేయూత
తెలంగాణఅక్షరం-వీణవంక కరీంనగర్ జిల్లా మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు కోల రాజయ్య ప్రమాదవశాత్తు తన కాలును కోల్పోయాడు. కాగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆలయ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ ను సంప్రదిచారు. దీంతో గుణ సాగర్ ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకుడు, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన భగవాన్ మహావీర్ ట్రస్ట్ సౌజన్యంతో రాజయ్యకు జైపూర్ కాలును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఐఏఎస్ నరహరితో పాటు గుణసాగర్ కు ధన్యవాదాలు …
Read More »