తెలంగాణఅక్షరం-వీణవంక మధ్యాహ్న భోజనం విషయంలో తప్పనిసరిగా శుభ్రత పాటించాలని వీణవంక ఎంఈవో సుద్దాల శోభారాణి సూచించారు. మండలంలోని పలు పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులకు శుక్రవారం ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగూణంగా తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ శుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందాంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రతినిధులు పులి అశోక్ కుమార్, సంతోష్ కుమార్, నాగిరెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులు, పాల్గొన్నారు.
Read More »