Monthly Archives: March 2025

హసన్ పర్తి పాఠశాల తనిఖీ

తెలంగాణ అక్షరం – హసన్ పర్తి స్థానిక మసీదు ఆవరణలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి రాజిరెడ్డి సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజనాన్ని, గ్రంథాలయ పుస్తకాలను వినియోగమును,పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎఫ్ ఎల్ ఎన్ అలైన్మెంట్ పాటించాలని, విద్యార్థులచే ప్రతిరోజు వర్క్ బుక్కులు రాయించాలని, గ్రంథాలయ పుస్తకాలు చదివించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చాడ సుదర్శన్ రెడ్డి, …

Read More »

‘రాజీవ్ యువ వికాసం’ ను సద్వినియోగం చేసుకోవాలి

  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి తెలంగాణ అక్షరం-వీణవంక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నరాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రూ.4 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …

Read More »

ఇసుక ట్రాక్టర్ బోల్తా- యువకుడి మృతి

తెలంగాణ అక్షరం- జమ్మికుంట కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి ప్రశాంత్ (32) ఇసుక లోడుతో ట్రాక్టర్ నడుపుతుండగా మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రశాంత్ మృతి చెందడంతో విలాసాగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఎంఎల్ఏ పాడి పరామర్శ

తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి, బీఆర్ఎస్ నాయకులు ఆనందం రాజమల్లయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని శనివారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, కమలాపూర్ మాజీజెడ్పిటిసి పుల్ల నవీన్ కుమార్, నాయకులు సత్యనారాయణ రావు, ఇంద్రసేనారెడ్డి, భానుచందర్, మధు, మహేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పరీక్ష సామగ్రి అందజేత

  తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రానికి చెందిన ట్యురిటో సంస్థల అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లోని కస్తూర్బా గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్ష ప్యాడ్లు, పెన్నులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపెళ్లి కుమారస్వామి, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, మంతెన శ్రీధర్, తొట్ల రాకేష్, మహంకాళి రాజు, కోరె …

Read More »

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణ అక్షరం- వీణవంక వీణవంక మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన పోలు రాజయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తి కృష్ణా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా 50 కేజీల బియ్యం పంపించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జున్నుతుల కొమాల్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, ఎండీ సలీం తదితరులు మృతుడి కుటుంబానికి అందజేశారు.

Read More »