Daily Archives: 3 April 2025

వీణవంక శాలివాహన సంఘం మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ అక్షరం-వీణవంక వీణవంక మండల శాలివాహన సంఘం నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మండల అధ్యక్షుడిగా మందారపు నరేష్, ఉపాధ్యక్షులుగా కొలిషెట్టి మొండయ్య, నల్లవెల్లి సంపత్, ప్రధాన కార్యదర్శిగా తాటికంటి తిరుపతి, కార్యదర్శులుగా ఇజిగిరి నరేష్, సిలివేరి విజయ్ ను ఆ సంఘం నాయకులు ఎన్నికున్నారు. ఈ సందర్భంగా నూతనంగా కమిటీని మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కులసంఘం నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం నాయకులు పాల్గొన్నారు.

Read More »

ఎనిమిదో రోజుకు చేరిన మార్క సురేష్‌ పాదయాత్ర

యాత్రకు సంఘీభావం తెలిపిన పలువురు సగర నాయకులు తెలంగాణఅక్షరం-హన్మకొండ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రాముడి కల్యాణం కోసం పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సగర సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కాగా ఈ యాత్ర 250కి.మీ పూర్తి చేసుకుని ఖమ్మ జిల్లాలోని ఏన్కూరు చేరింది. కాగా ఈ పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి …

Read More »