వీణ వంక : శ్రీ రాములపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుర్మిండ్ల రాజయ్య (78) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం. మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల రాజయ్య 1990-95లో సర్పంచ్ గా గ్రామ ప్రజలకు సేవలందించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాజయ్య గురువారం ఆరోగ్యం విషమించి మృతి చెందారు. రాజయ్య మృతిపట్ల గ్రామ ప్రజలు, మండల ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
Read More »Daily Archives: 10 April 2025
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
డీజేఎఫ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా తెలంగాణఅక్షరం-పెద్దపల్లి ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు, జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనిడెమక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డీజేఎఫ్) రాష్ర్ట అధ్యక్షుడు మోట పలుకుల వెంకట్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా, రిలే నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోట పలుకుల వెంకట్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. …
Read More »పొదుపు సంఘం డబ్బుల పంపిణీ
తెలంగాణ అక్షరం – బాలాపూర్ బాలాపూర్ మండల పరిధిలోని నాగర్గుల్ గ్రామంలో గురువారం పొదుపు సంఘం డబ్బులను పంపిణీ చేయడం జరిగింది. మహేంద్ర మేదరి యువజన సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు తోకల లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, సంఘంలో జమ ఉన్న రూ. 3 లక్షల 43 వేలను ఎడుగురి సభ్యులకు ఒకొక్కరికి రూ.49 వేలను పంపిణీ చేశారు. ఈ మొత్తాన్ని మూడు నెలల తర్వాత తిరిగి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువకులు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, మనం …
Read More »