హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు తెలంగాణఅక్షరం-హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ మైదానంలో వాకర్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పది లక్షల విలువ చేసే వాకింగ్ ట్రాక్, గేట్ పనులను ఆయన శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి …
Read More »Monthly Archives: May 2025
వీణవంకలో వైభవంగా బీరప్ప ఉత్సవాలు
తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం లగ్గ బోనాలు, నాగవల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. గొల్ల, కురుమ కులస్తులు మహిళలు బోనాలతో రాగా బీరన్న పూజారుల ఒగ్గు డప్పు చప్పుళ్ళుతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీరన్న పూజారులు గొర్రె పిల్లను గావు పట్టారు. బోనాల చుట్టూ తిరిగే కార్యక్రమం జనం ఎంతో ఆసక్తిగా చూశారు. అనంతరం బోనాలతో దేవాలయానికి చేరుకొని నైవేధ్యం పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు. …
Read More »స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కుర్మ అక్షయ సగరను అభినంధించిన మంత్రి, కలెక్టర్
Mining Engineering 1st Rank | రామగిరి మే 26: ఉన్నత విద్యా మండలి ప్రకటించిన ఈసెట్ 2025 ఫలితాల్లో మైనింగ్ విభాగంలో రాష్ట స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన కుర్మ అక్షయ సగరను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ శ్రీ కోయ హర్ష, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని కష్టపడి చదవాలని సూచించారు. ఉన్నత …
Read More »కుత్బుల్లాపూర్ కేంద్రంలో ఘనంగా తిరంగ ర్యాలీ
తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :భారతదేశ పౌరుషం, అధునాతన సైనిక బలంతో, ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా నిర్వహించిన త్రివిధ దళాలకు సంఘీభావం తెలిపేందుకు నేడు బీజేపీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు తిరంగ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటానికై బీజేపీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో కొంపల్లి నుండి భారీగా బీజేపీ నాయకులు మరియు జాతీయ వాదులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజి రెడ్డి …
Read More »వీణవంకలో దళితబంధు సాధన సమితి నాయకుల అరెస్టు
వీణవంక, మే 24:మండల కేంద్రంలో దళిత బంధు సాధన సమితి నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్ట్ చేశారు. దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలని కోరుతూ శనివారం హుజురాబాద్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు కు పిలుపునీయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు.అక్రమ అరెస్టు సరైన పద్ధతి కాదని, వెంటనే దళిత బంధు రెండో విడుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో దళిత బంధు …
Read More »గొల్ల, కురుమ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో కురుమ, గొల్ల కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు గొల్ల, కురుమ కులస్తులు అమ్మవారిని సమర్పించారు. ఒగ్గు పూజారిలొచ్చే ఒగ్గు డోల తో నృత్యాలతో గొల్ల, కురుమ కులస్తులు మహిళలు పోచమ్మ దేవాలయం చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కురుమ కులస్తులు పాల్గొన్నారు.
Read More »బోర్నపల్లి గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం కార్యవర్గం ఎన్నిక
తెలంగాణఅక్షరం-హుజురాబాద్ హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేశ బోయిన ఓదెలు ప్రధాన కార్యదర్శిగా కేశ బోయిన అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కేశవైన లింగయ్య ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా నాని, రమేష్, మేడుదుల రాజు, కేశ బోయిన కేతమ్మ, గుంపుల రాజమ్మ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సాయంత్రం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను సంఘ సభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
Read More »నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
తెలంగాణఅక్షరం-పెద్దపల్లి జిల్లాలో విత్తనాల డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు వికయిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో విత్తనాల విక్రయంలో ఈ పాస్ యంత్రాల వినియోగంపై రిటైలర్లకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, రాష్ర్ట విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేటి అవినాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం …
Read More »Strict action | నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. శిక్షణ ఎస్సై సాయికృష్ణ
తెలంగాణఅక్షరం-వీణవంక Strict action | ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శిక్షణ ఎస్సై సాయికృష్ణ విత్తన డీలర్లను హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపుల యజమానులతో ఏఓ గణేష్ తో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మకూడదని, గుర్తుతెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమినాశకాలు అమ్మకూడదని సూచించారు. పురుగు మందులు అమ్మేటపుడు రైతు ఆధార్ కార్డు, పాస్ బుక్ జీరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. …
Read More »బీరన్న పెద్ద పండుగ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
దేవతామర్తులకు అభిషేకాలు చేసిన గొల్ల, కురుమలు తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల కేంద్రంలో గొల్ల, కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప పెద్ద పండుగ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బీరన్న పూజారుల వేషధారణ డప్పుచప్పులు నృత్యాలతో గొల్ల కురుమ కులస్తులు, మహిళలు భారీ ర్యాలీగా బీరన్న దేవాలయానికి బుధవారం చేరుకున్నారు. బీరన్న దేవాలయంలో పూజల అనంతరం గ్రామంలోని పోచమ్మ, మాoకాలమ్మ, వెంకటేశ్వర శివాలయం, భూలక్ష్మి-మా లక్ష్మి, పెద్దమ్మతల్లి, మడెలయ్య, ఎల్లమ్మ దేవాలయాల్లో దేవతామూర్తులకు పాలాభిషేకం, …
Read More »